సుప్రీమ్ హీరో సాయిధరమ్‌తేజ్ హీరోగా ‘నేను శైలజ’ ఫేమ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో మైత్రీమూవీ మేకర్స్ బ్యానర్ నిర్మిస్తోన్న చిత్రం ‘చిత్రలహరి’.

సుప్రీమ్ హీరో సాయిధరమ్‌తేజ్ హీరోగా ‘నేను శైలజ’ ఫేమ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో మైత్రీమూవీ మేకర్స్ బ్యానర్ నిర్మిస్తోన్న చిత్రం ‘చిత్రలహరి’. సాయిధరమ్ తేజ్ సరసన కల్యాణి ప్రియదర్శన్, నివేదా సేతురాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. 

అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి సినిమాను ఏప్రిల్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈనేపథ్యంలో ఈ చిత్రి ప్రీ రిలీజ్ బిజినెస్ ని నిర్మాతలు విజయవంతంగా పూర్తి చేసారు. వరస ఫ్లాఫ్ లు ఉన్నా ఈ చిత్రానికి వచ్చిన క్రేజ్ తో మంచి బిజినెస్ జరిగింది. ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు 13. 73 కోట్ల బిజినెస్ వరకూ జరిగింది. ఏరియా వైజ్ బ్రేకప్ తో వివరాలు క్రింద..

ఏరియా బిజినెస్ (కోట్లలో )

--------------- --------------------------------------------------

నైజాం 3.00

సీడెడ్ 1.80

నెల్లూరు 0.48

కృష్ణా 0.90

గుంటూరు 1.10

వైజాగ్ 1.35

ఈస్ట్ గోదావరి 0.96

వెస్ట్ గోదావరి 0.84

టోటల్ (ఆంధ్రా & తెలంగాణా) 10.43

ఓవర్ సీస్ 1.80

మిగిలిన ప్రాంతాలు 1.50

మొత్తం (ప్రపంచ వ్యాప్తంగా) 13.73

హీరో సాయిధరమ్‌తేజ్ మాట్లాడుతూ ‘ దేవిశ్రీప్రసాద్ అద్భుతమైన సంగీతంతోపాటు బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. నాలుగు పాటలు ఆడియన్స్‌ని మెప్పిస్తాయి. మంచి సినిమా చేయడానికి అవకాశమిచ్చిన నిర్మాతలకు కృతజ్ఞతలు. చాలా సపోర్ట్‌చేస్తూ, ఎక్కడా లోటులేకుండా చూసుకున్నారు. ఇక డైరెక్టర్ కిషోర్ తిరుమల కథను ఎంతబాగా చెప్పాడో, అంతకంటే బాగా డైరెక్ట్ చేశాడు.

కార్తీక్ అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. మొదటినుంచీ సునీల్ కామెడీ టైమింగ్, సెన్స్‌ను ఎంజాయ్ చేసేవాడిని. నటుడిగా మారిన తర్వాత ఆయనతో ఓ సినిమా అయినాచేయాలని అనుకున్నా. ఈ సినిమాలో కలిసి పని చేశా. ఆయనతో పనిచేయడాన్ని ఎంజాయ్ చేశాను అన్నారు.