సీనియర్ నటుడు శరత్ బాబు మరణంతో టాలీవుడ్ లో విషాద ఛాయలు నెలకొన్నాయి. శరత్ బాబు మరణ వార్త తెలిసి తెలుగు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా నివాళి అర్పిస్తున్నారు. 

శరత్ బాబు మరణంతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు నెలకొన్నాయి. శరత్ బాబు మరణం కలచివేసిందన్నారు మెగాస్టార్ చిరంజీవి. ట్విట్టర్ వేదికగా నివాళి అర్పించిన ఆయన ఈ విధంగా నోట్ రాశారు. వెండితెర 'జమిందార్', ప్రముఖ నటుడు శరత్ బాబు గారి మరణ వార్త కలచివేసింది. అందం హుందాతనం ఉట్టిపడే తన నటనతో ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకున్న శ్రీ శరత్ బాబు గారితో నాకు ఎంతో అనుబంధం వుంది. అనేక చిత్రాలలో ఆయన నా సహనటుడుగా ఉన్నారు. ఆయన కుటుంబసభ్యులకు, అభిమానులందరికీ నా ప్రగాఢ సంతాపం. అని మెగాస్టార్ ట్వీట్ చేశారు.

Scroll to load tweet…

ఇక శరత్ బాబు మరణంతో దిగ్బ్రాంతికి లోనయ్యానన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. తన మొదటి సినిమాఅక్కడమ్మాయి.. ఇక్కడబ్బాయిలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారని. పరిశ్రమ చెన్నైలో ఉన్నప్పటి నుంచీ శరత్ బాబుగారితో పరిచయం ఉన్నట్టు పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకున్నారు. విభిన్న పాత్రలతో.. భావోద్వేగాలు పలికించిన నటుడు శరత్ బాబు అంటూ నివాళి అర్పించారు పవన్. 

Scroll to load tweet…

సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ కూడా శరత్ బాబు మరణంపై స్పందించారు. శరత్ బాబు గారు విలక్షణమైన నటనతో చిత్రసీమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. కథానాయకుడిగా, ప్రతినాయకుడిగా, సహాయనటుడిగా తనదైన ముద్ర వేశారు. శరత్ బాబు గారు క్రమశిక్షణ, అంకితభావం గల నటులు. ఆయనతో కలసి పని చేయడం మర్చిపోలేని అనుభూతి. ఈ రోజు ఆయన మన మధ్య లేకపోవడం ఎంతో బాధాకరం. శరత్ బాబు గారి మరణం పరిశ్రమకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను. ఆయన కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అన్నారు బాలయ్య. 

శరత్ బాబు మరణ వార్త తనను కలచివేసిందన్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఫిల్మ్ ఇండస్ట్రీ విలక్షణ నటుడిని కోల్పోయిందన్నారు. ఆయన మరణం పరిశ్రమకు తీరని లోటు అన్న ఎన్టీఆర్..హృదయపూర్వక సంతాపం ప్రకటించారు. 

Scroll to load tweet…

అటు మాస్ మహారాజ్ రవితేజ్ కూడా శరత్ బాబు మరణంపై స్పందించారు. శరత్ బాబుగారిని చాలా మిస్ అవుతున్నాం. ఇండస్ట్రీ ఒక గొప్ప నటుడిని కోల్పోయింది అంటై ట్వీట్ చేశారు రవితేజ. 

Scroll to load tweet…

శతర్ బాబు మరణం పై దేశ ప్రధాని నరేంద్రమోది స్పందించారు. శ్రీ శరత్ బాబు జీ బహుముఖ సృజనాత్మకత కలిగి ఉన్న నటులు. అతని సుదీర్ఘ చలనచిత్ర జీవితంలో అనేక భాషలలో అనేక ప్రసిద్ధ సినిమాలతో వారు గుర్తుండిపోతారు. ఆయన మృతి పట్ల బాధ కలిగింది. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి ఓం శాంతి. అంటూ ట్వీట్ చేశారు ప్రధాని. 


Scroll to load tweet…