సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఏ రేంజ్ లో క్రేజ్ ఉంటుందో అందరికీ తెలిసిందే. అయితే చిరంజీవి ఒకదశలో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ నే దాటేశాడని తెలుస్తోంది. ఈ మేరకు ఓ మ్యాగజైన్ కవర్ ఫొటోలో నెట్టింట వైరల్ అవుతోంది.
టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఎంతో మంది నటీనటులకు స్ఫూర్తిదాయకం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన తెలియని వారంటు ఉండరు. ఆయన కేరీర్ లో150కిపైగా చిత్రాల్లో నటించిన చిరు క్రేజ్ ఇప్పటికే హైలోనే ఉంటుంది. మెగా అభిమానిని అని చెప్పుకోవడానికి ఫ్యాన్స్ కూడా తెగ సంతోషిస్తారు. తన పెర్ఫామెన్స్ తో టాలీవుడ్ ను షేక్ చేసిన నటుళ్లలో చిరు ఒకరని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే చిరంజీవి క్రేజ్ 1990లో ఓ రేంజ్ లో ఉండేది. ఆ సమయంలో చిరు ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరో, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan)నే దాటేశాడు. ఆయన పాపులారిటీ దగ్గట్టుగానే భారీ రెమ్యూనరేషన్ తీసుకునే వాడంట. అందులోనూ బిగ్ బిగ్ బీ కంటే ఎక్కువ పారితోషికం తీసుకొని రికార్డు క్రియేట్ చేశాడు.
నిన్న మెగాస్టార్ చిరంజీవి 67వ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు చిరంజీవి బర్త్ డే సెలబ్రేషన్స్ (Chiranjeevi Birthday Celebrations)ను ఒక రేంజ్ లో నిర్వహిస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో అన్నయ్య ఫొటోలను విపరీతంగా వైరల్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఓ మ్యాగజైన్ కవర్ పేజీపై చిరు ఫొటో ఉన్న ఫొటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీనిపై ‘బిగ్గర్ దెన్ బచ్చన్’ అనే టైటిల్ తో పాటు అప్పట్లో చిరు ఓ సినిమాకు రూ.1.25 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది. చిరు కేరీర్ లో 1980లో వరసగా బ్లాక్ బస్టర్ హిట్స్ పడ్డాయి. దీంతో 1990 నాటికి హ్యయేస్ట్ రెమ్యూనరేషన్ తీసుకునే నటులలో చిరు చేరిపోయాడు. అంతేకాకుండా భారతీయ చలన చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే నటుడిగాను రికార్డు క్రియేట్ చేశాడు. ఈ విషయంలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ నే చిరంజీవి వెనక్కి నెట్టారు. ప్రస్తుతం ఈ కవర్ ఫొటో ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతోంది.
రాజకీయాలకు దూరమైన తర్వాత ‘150’ చిత్రంతో చిరు చిత్ర పరిశ్రమకు రీ ఎంట్రీ ఇచ్చాడు. అప్పటి నుంచి బ్యాక్ టు బ్యాక్ సినిమాలను రిలీజ్ చేస్తూ అభిమానులు, ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇటీవల ‘ఆచార్య’ చిత్రంతో థియేటర్లలో సందడి చేసిన మెగాస్టార్.. ప్రస్తుతం ఏకకాలంలో మూడు చిత్రాలు ‘గాడ్ ఫాదర్’,‘వాల్తేరు వీరయ్య’,‘భోళా శంకర్’ నటిస్తున్నారు. ఇందులో Bhola Shankar చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 14న రిలీజ్ చేయనున్నట్టు ఇటీవల అధికారిక ప్రకటన వచ్చింది. ఇక ‘గాడ్ ఫాదర్’ను మాత్రం ఈ ఏడాదే అక్టోబర్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘వాల్తేరు వీరయ్య’ కూడా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. ఇలా వరుస చిత్రాల్లో నటిస్తూ చిరంజీవి ప్రస్తుతం బిజీగా ఉన్నారు.