డై హార్ట్ ఫ్యాన్స్ తో పాటు సగటు సినిమా అభిమాని వకీల్ సాబ్ చిత్ర విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ లిస్ట్ లో మెగాస్టార్ చిరంజీవి కూడా చేరడం విశేషం. వకీల్ సాబ్ సినిమా గురించి తాను ఎంతగా ఎదురుచూస్తున్నాడో తెలియజేస్తూ.. చిరంజీవి ట్వీట్ చేశాడు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని వెండితెరపై చూసి మూడేళ్లు దాటిపోగా డై హార్ట్ ఫ్యాన్స్ తో పాటు సగటు సినిమా అభిమాని వకీల్ సాబ్ చిత్ర విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ లిస్ట్ లో మెగాస్టార్ చిరంజీవి కూడా చేరడం విశేషం. వకీల్ సాబ్ సినిమా గురించి తాను ఎంతగా ఎదురుచూస్తున్నాడో తెలియజేస్తూ.. చిరంజీవి ట్వీట్ చేశాడు.
''చాలా కాలం తరువాత పవన్ కళ్యాణ్ ని వెండితెర మీద చూడటానికి మీలాగే నేను కూడా ఎదురుచూస్తున్నాను. అమ్మ, కుటుంబ సభ్యులతో రేపు సాయంత్రం థియేటర్ లో వకీల్ సాబ్ చూస్తాను. సినిమా చూశాక నా ఫీలింగ్ మీతో పంచుకోవాలని ఉంది. కాబట్టి చూస్తూ ఉండండి'' అని చిరంజీవి ట్వీట్ చేశారు. అలాగే కెరీర్ బిగినింగ్ లో పవన్ కళ్యాణ్ మేకప్ వేసుకుంటున్న సమయంలో... స్వయంగా జుట్టు సరిచేస్తున్న ఫోటో ఫోటో పంచుకున్నారు.
చిరంజీవి తన తమ్ముడు పవన్ అంటే ఎంతగా ఇష్టపడతాడో, పవన్ సినిమాలపై ఎంత ఆసక్తి ఉంటుందో చెప్పడానికి తాజా ట్వీట్ నిదర్శం. ఇక మరికొన్ని గంటల్లో వకీల్ సాబ్ మూవీ బెనిఫిట్ షోలు థియేటర్స్ లో పడనున్నాయి. శుక్రవారం తెల్లవారు జాము నుండే బెనిఫిట్ షోల ప్రదర్శన ఉండనుంది. ఇప్పటికే టికెట్స్ బుక్ చేసుకున్న ఫ్యాన్స్ థియేటర్స్ దగ్గర హంగామా చేయనున్నారు.
హిందీ హిట్ మూవీ పింక్ కి తెలుగు రీమేక్ గా వకీల్ సాబ్ మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే. దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కించగా దిల్ రాజు, బోనీ కపూర్ నిర్మించారు. నివేద థామస్, అంజలి, అనన్య కీలక పాత్రలు పోషించారు. థమన్ వకీల్ సాబ్ చిత్రానికి స్వరాలు సమకూర్చారు.
