బాలీవుడ్‌ కండల వీరుడు, బాలీవుడ్‌ భాయిజాన్‌ సల్మాన్‌ ఖాన్‌ నేటితో 55ఏళ్లు పూర్తి చేసుకున్నారు. అంచెలంచెలుగా ఎదిగి బాలీవుడ్‌లోనే అగ్ర హీరోల్లో ఒకరిగా నిలిచిన సల్మాన్‌ ఖాన్‌ ఫ్యాన్స్ తో తన పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉంటున్నారు. అందుకు ముందుగానే వారికి సందేశాన్ని అందించారు. ఎవరూ తన కోసం రావద్దని చెప్పారు. అయితే సల్మాన్‌కి సోషల్‌ మీడియా వేదికగా విషెస్‌ తెలియజేస్తున్నారు సినీ ప్రముఖులు. బాలీవుడ్‌, టాలీవుడ్‌ ప్రముఖులు స్పందించి ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

మెగా స్టార్‌ చిరంజీవి, విక్టరీ వెంకటేష్‌, మహేష్‌బాబు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవి చెబుతూ, `పుట్టిన రోజు శుభాకాంక్షలు డియర్‌ బ్రదర్‌ సల్మాన్‌ ఖాన్‌. మీకు మంచి ఆరోగ్యం, ఆనందం కలగాలని ఆకాంక్షిస్తున్నా` అని తెలిపారు. 

విక్టరీ వెంకటేష్‌ సైతం సల్మాన్‌కి విషెస్‌ తెలిపారు. `అత్యంత అద్భుతమైన, దయగల హృదయం కలిగిన స్నేహితుడు, సోదరుడు సల్మాన్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీకు ఎల్లప్పుడు ఆనందం, విజయం, మంచి ఆరోగ్యం ఉండాలని కోరుకుంటున్నా` అని చెబుతూ, ఆయనతో దిగిన ఫోటోని పంచుకున్నారు. ఇద్దరూ స్కూటీలపై ఫ్రెండ్లీగా దిగిన ఫోటో విశేషంగా ఆకట్టుకుంటుంది. 

సూపర్‌ స్టార్‌ మహేష్‌ స్పందిస్తూ, సూపర్‌ కూల్‌ సల్మాన్‌కి బర్త్ డే విషెస్‌. మంచి ఆరోగ్యం, సంతోషం, శాంతి ఉండాల`ని తెలిపారు.