Asianet News TeluguAsianet News Telugu

చిరంజీవికి కుళ్లు తెప్పించిన వరుణ్‌ తేజ్‌.. సంక్రాంతికి ఒక్కటైన మెగా ఫ్యామిలీ

చిరంజీవి, రామ్‌చరణ్‌, వరుణ్‌తేజ్‌, సాయిధరమ్‌ తేజ్‌, వైష్ణవ్‌ తేజ్‌, నాగబాబు, అల్లు అరవింద్‌, నిహారిక, చైతన్య, చిరు కూతుళ్లు, చిరు సిస్టర్స్ ఇలా అంతా ఒక్క చోటకి చేరి సంక్రాంతిని సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు. 

chiranjeevi varun tej prepared dosha videos viral
Author
Hyderabad, First Published Jan 14, 2022, 9:23 PM IST

సంక్రాంతి పండుగ సందర్భంగా మెగా ఫ్యామిలీ  ఒక్కటైంది. మెగా ఫ్యామిలీ,  అల్లు వారి ఫ్యామిలీ కలిసింది. బోగి పండుగ సందర్భంగా వీరంతా కలిసి చిరంజీవి  ఇంటికి చేరారు. ఉదయం నుంచే బోగి పండుగ ప్రారంభించారు. బోగి మంటల్లో పాల్గొని  ఎంజాయ్‌ చేశారు. చిరంజీవి, రామ్‌చరణ్‌, వరుణ్‌తేజ్‌, సాయిధరమ్‌ తేజ్‌, వైష్ణవ్‌ తేజ్‌, నాగబాబు, అల్లు అరవింద్‌, నిహారిక, చైతన్య, చిరు కూతుళ్లు, చిరు సిస్టర్స్ ఇలా అంతా ఒక్క చోటకి చేరి సంక్రాంతిని సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు. 

ఈ సందర్భంగా మెగా ఫ్యామిలీ అంతా రెండు తెలుగు ప్రజలకు, అభిమానులకు సంక్రాంతి  శుభాకాంక్షలు చెప్పారు. ఈ వీడియోని చిరంజీవి తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా  పంచుకున్నారు. ప్రస్తుతం ఇది వైరల్‌ అవుతుంది. అయితే ఈ సందర్భంగా ఓ ఫన్నీ సంఘటన జరిగింది. మామూలుగా అయితే దోశలు వేయడంలో చిరు స్పెషల్. అందులో మాస్టార్ ఎగరేసుకుంటూ మరీ దోశలు తిప్పేస్తారు. అలా చేయితిరిగిన వంటగాడిలా చిరు దోశలు వేస్తాడు.

 సంక్రాంతి స్పెషల్‌గా ఇంట్లో అందరూ ఉండటంతో.. మార్నింగ్‌ టిఫిన్స్ చేసే బాధ్యత మెగాస్టార్‌ తీసుకున్నారు. వరుణ్‌తేజ్‌ తో కలిసి దోశలు  వేశారు. దోశలు వేయడంలో చిరంజీవి చాలా ఎక్స్ పర్ట్. గతంలోనూ దోశలు  వేస్తూ వీడియోలు పంచుకుని ఆకట్టుకున్నారు. తాజాగా చిరు దోశలు వేయడాన్ని చెబుతూ ఓ వీడియోను షేర్ చేశాడు వరుణ్ తేజ్. ఇందులో అసలు విషయం బయటపడింది. చిరు వేసిన దోశ సరిగ్గా రాలేదు. వరుణ్ తేజ్ వేసిన దోశ చాలా బాగా వచ్చింది. దీంతో వాడిది బాగా వచ్చింది.. నాది రాలేదు.. నాకు కుళ్లొచ్చింది.. అందుకే ఇలా చేశాడు.. ఇది దోశ కాదు ఉప్మా అని వరుణ్ తేజ్‌ మీద సెటైర్ వేశాడు చిరు. ప్రస్తుతం ఈ వీడియో సైతం వైరల్‌ అవుతుంది. 

కాగా ఈ వీడియోను ‘బాస్‌తో 101వ దోశ’ అన్న క్యాప్షన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. దీంతో వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. పోస్ట్ చేసిన వీడియోని నెటిజన్లు తెగ చూసేశారు.  ఇక ఈ వీడియోను చూసి మెగా అభిమానులు మురిసిపోతున్నారు. నిహారిక సైతం అలరించింది.  ఇంటి ముందు ముగ్గులు, వరుణ్‌ దోశలతో సహా ఫ్యామిలీతో సరదాగా గడుపుతున్న సన్నివేశాలనంతటినీ వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది.  ఇదిలా ఉంటే ఇందులో పవన్‌, బన్నీ,  శిరీష్‌ కనిపించకపోవడం గమనార్హం. 

Follow Us:
Download App:
  • android
  • ios