'విశ్వంభర' వీరుడు రెడీ.. మెగా గుడ్ న్యూస్ ఇదిగో..

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం విశ్వంభర. చిరంజీవి కెరీర్ లోనే భారీ బడ్జెట్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. బింబిసార ఫేమ్ వశిష్ట ఈ చిత్రానికి దర్శకుడు. 

Chiranjeevi to join Vishwambhara sets on this time dtr

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం విశ్వంభర. చిరంజీవి కెరీర్ లోనే భారీ బడ్జెట్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. బింబిసార ఫేమ్ వశిష్ట ఈ చిత్రానికి దర్శకుడు. ఇటీవలే ఈ చిత్ర టైటిల్, కాన్సెప్ట్ గురించి రివీల్ చేస్తూ విడుదల చేసిన వీడియోకి మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ వచ్చింది. 

కళ్ళు చెదిరే విజువల్స్ తో ఫాంటసీ డ్రామాగా వశిష్ట ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. కాన్సెప్ట్ వీడియోలో చూపించిన విజువల్స్ ఒక్కసారిగా సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఈ చిత్రంలో చిరు ముల్లోకాలు తిరిగే వీరుడిగా నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

ఈ చిత్ర షూటింగ్ కోసం ఇదివరకే అన్నపూర్ణ స్టూడియోస్ లో 7 ఎకరాల్లో 13 భారీ సెట్స్ నిర్మించారు. ముల్లోకాలని చుట్టి వచ్చే వీరుడి రాక కోసం అంతా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఆ వీరుడు కూడా సిద్ధం అయ్యారు. తాజా సమాచారం మేరకు మెగాస్టార్ చిరంజీవి ఫిబ్రవరి మొదటి వారంలో షూటింగ్ కి జాయిన్ కాబోతున్నట్లు తెలుస్తోంది. 

గత ఏడాది చిరు మోకాలి సర్జరీ చేయించుకున్నారు. ఇప్పుడు అంతా సెట్ అయింది. చిరంజీవి షూటింగ్ కి రెడీగా ఉన్నారు. ప్రస్తుతం దర్శకుడు వశిష్ట ఇతర నటీనటులతో షూటింగ్ చేస్తున్నారు. చిరంజీవి కెరీర్ లోనే ఈ చిత్రం అంత్యంత భారీ బడ్జెట్ లో తెరకెక్కుతోంది. బింబిసార చిత్రంతో మాయ చేసిన వశిష్ట.. విశ్వంభరతో అద్భుతాలు చేసేందుకు సిద్ధం అవుతున్నారు. జగదేక వీరుడు అతిలోక సుందరి, అంజి చిత్రాల తర్వాత ఆ జోనర్ లో మెగాస్టార్ నటిస్తున్న చిత్రం ఇదే. ఇదిలా ఉండగా చాలా కాలం తర్వాత చిరంజీవి, కీరవాణి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం కావడం ఆ అంచనాలు కూడా ఉన్నాయి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios