చిరంజీవి అల్లుడు, హీరో కళ్యాణ్‌ దేవ్‌కి కరోనా సోకింది. తనకు కొద్దిపాటి లక్షణాలు కనిపించడంతో బుధవారం కోవిడ్‌ 19 టెస్ట్ చేయించుకున్నాడట. తాజాగా పాజిటివ్‌ అని తేలిందని వెల్లడించారు. హాస్పిటల్‌లో క్వారంటైన్‌ అయినట్టు తెలిపాడు.

చిరంజీవి అల్లుడు, హీరో కళ్యాణ్‌ దేవ్‌కి కరోనా సోకింది. తనకు కొద్దిపాటి లక్షణాలు కనిపించడంతో బుధవారం కోవిడ్‌ 19 టెస్ట్ చేయించుకున్నాడట. తాజాగా పాజిటివ్‌ అని తేలిందని వెల్లడించారు. హాస్పిటల్‌లో క్వారంటైన్‌ అయినట్టు తెలిపాడు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని, త్వరలోనే మరింత స్ట్రాంగ్‌గా, ఆరోగ్యంగా తిరిగి వస్తానని తెలిపారు. అభిమానుల ప్రేమకు ధన్యవాదాలు తెలిపారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
View post on Instagram

చిరంజీవి రెండో కూతురు శ్రీజ భర్త కళ్యాణ్‌ దేవ్‌. `విజేత` సినిమాతో హీరోగా టాలీవుడ్‌కి పరిచయం అయ్యాడు. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మిశ్రమ స్పందనని రాబట్టుకుంది. ప్రస్తుతం ఆయన `సూపర్‌ మచ్చి` చిత్రంలో నటిస్తున్నాడు. ఇది విడుదలకు రెడీ అవుతుంది. దీంతోపాటు మరో సినిమా చేస్తున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పటికే మెగా ఫ్యామిలీలో రామ్‌చరణ్‌కి కరోనా సోకింది. ఆయన కోలుకున్నారు. ఇటీవల పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌కి సోకిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నారు.