నేడు ఫాదర్స్ డే పురస్కరించుకొని తండ్రి వెంకట్రావు ని తలచుకున్నాడు. ఆయనతో గల అనుబంధాన్ని పంచుకున్నారు. 

మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా జీవిగా మారిపోయారు. సందర్భం ఏదైనా తన మార్కు ట్వీట్స్, పోస్ట్స్ తో ప్రత్యేకత చాటుకుంటున్నారు. నేడు ఫాదర్స్ డే పురస్కరించుకొని తండ్రి వెంకట్రావు ని తలచుకున్నాడు. ఆయనతో గల అనుబంధాన్ని పంచుకున్నారు. చిరు తండ్రిని ఉద్దేశిస్తూ 'మా నాన్న కి కోపం ఎక్కువ.. ఆ కోపానికి ప్రేమ ఎక్కువ.. ఆ ప్రేమకి బాధ్యత ఎక్కువ. తమ కలల్ని పక్కనపెట్టి కుటుంబ బాధ్యతల నెరవేర్చటం కోసం ప్రతి రోజు కష్టపడే నాన్నలందరికి ఫాదర్స్ డే శుభాకాంక్షలు' అంటూ ట్వీట్ చేశారు. 


ఓ సాధారణ ప్రభుత్వ ఉద్యోగి అయిన వెంకట్రావ్ గారు నటుడు కావాలన్న చిరంజీవి అభిరుచి ప్రోత్సహించారు. ఎటువంటి సప్పోర్ట్ లేకుండా టాలెంట్ తో అంచలంచెలుగా ఎదిగి, వెండితెర రారాజు అయ్యారు చిరంజీవి. మెగా ఫ్యామిలీ అనే వంశ వృక్షాన్ని టాలీవుడ్ లోనాటి స్టార్ హీరోలను కుటుంబం నుండి వెండితెరకు పరిచయం చేస్తున్నారు. 


ఇక కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ వరుసగా చిత్రాలు చేస్తున్నారు. ఆయన లేటెస్ట్ మూవీ ఆచార్య షూటింగ్ చివరి దశలో ఉంది. దర్శకుడు కొరటాల శివ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. చరణ్, పూజా హెగ్డే సైతం ఆచార్యలో కీలక రోల్స్ చేస్తున్నారు. 

Scroll to load tweet…