72వ గణతంత్ర దినోత్సవ వేడుకలో మెగాఫ్యామిలీ పాల్గొంది. మెగా స్టార్‌ చిరంజీవి, రామ్‌చరణ్‌, నాగబాబు, నిర్మాత అల్లు అరవింద్‌ తదితరులు పాల్గొన్నారు. చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌ వద్ద ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్బంగా మెగాస్టార్ చిరంజీవి జెండాను ఎగురవేశారు. 

72వ గణతంత్ర దినోత్సవ వేడుకలో మెగాఫ్యామిలీ పాల్గొంది. మెగా స్టార్‌ చిరంజీవి, రామ్‌చరణ్‌, నాగబాబు, నిర్మాత అల్లు అరవింద్‌ తదితరులు పాల్గొన్నారు. చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌ వద్ద ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్బంగా మెగాస్టార్ చిరంజీవి జెండాను ఎగురవేశారు. ఈ వేడుకలో చిరంజీవి బ్లడ్ బ్యాంకు టీం తో పాటు మెగా ఫాన్స్ కూడా పాల్గొన్నారు. 

Scroll to load tweet…

ఈ సందర్బంగా మెగా అభిమానులు రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించి రక్తదానం చేసిన అభిమానులను చిరంజీవి, రామ్ చరణ్ లు పరామర్శించారు. మెగా అభిమానుల ఆధ్వర్యంలో బ్లడ్ క్యాంప్ విజయవంతంగా నిర్వహిస్తున్నారు. అన్ని రంగాల్లో.. రాజకీయ నాయకుల నుండి సామాన్య ప్రజలంతా జరుపుకునే గొప్ప పండగ గణతంత్ర దినోత్సవం అని ఈ సందర్భంగా చిరంజీవి అన్నారు. మరోవైపు ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌లో రక్తదానం చేయాలని అభిమానులను కోరారు చిరంజీవి.

Scroll to load tweet…

మరోవైపు గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యానికి కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చిరంజీవి అభినందించారు. `నా ప్రియమైన సోదరుడు ఎస్పీ బాలూ గారికి `పద్మ విభూషణ్‌` పురస్కారం ప్రకటించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆయన దీనికి అర్హులు. మరణాంతరం రావడం కాస్త బాధగా ఉంది` అని చెప్పారు. 

Scroll to load tweet…