పవన్ దారిలో చిరు, 25 కోట్లు లాభం
ఈ స్కీమ్ ని వాస్తవానికి పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా అమలు చేస్తున్నారు. ఆయన పనిచేసే డైరక్టర్స్ ని చూస్తే ఆ విషయం మనకు అర్దమవుతుంది. బాబి, వేణు శ్రీరామ్, డాలీ ఇలా ఆయన స్దాయిలో లేని చిన్న డైరక్టర్స్ తో ఆయన పనిచేస్తున్నారు. లాభాలు తన నిర్మాతలుకు చూపించగలుగుతున్నారు. చిరంజీవి కూడా అదే పద్దతిలో వెల్తున్నారు.
పెద్ద బడ్జెట్ సినిమాలు ఎప్పుడూ పెద్ద స్దాయిలో లాభాలు తేవు. ఎక్కడో బాహుబలి క్లిక్ అవుతుంది కానీ మిగతావన్ని అతి తక్కుల లాభాల్లో బయిటపడాల్సింది. కొన్ని పెద్ద సినిమాలు అయితే హిట్ టాక్ వచ్చినా నష్టాలు చవిచూడాల్సిందే. పెద్ద సినిమా చేసిన నిర్మాత కు ఆనందం మిగలటం లేదు. డబ్బు నీళ్లలా ప్రొడక్షన్ లో పోస్తున్నా ఆ స్దాయిలో తన షేర్ తెచ్చుకోలేకపోతున్నారు. అందుకు అనేక కారణాలు ఉన్నాయి. 150 కోట్లు పెడితే 15 కోట్లు కూడా వెనక్కి లాభం రూపంలో రాకపోతే ఇంకెందుకు సినిమా చేస్తున్నాం అని నిర్మాతలు వాపోతున్నారు. అయితే ఈ ట్రెండ్ కు చెక్ పెట్టేందుకు ఏ హీరో ముందుకు రావటం లేదు. కానీ చిరంజీవి మాత్రం అందుకు మినహాయింపుగా చెప్తున్నారు.
ఆయన తన నిర్మాతలతో ఖచ్చితంగా చెప్తున్నారట. మినిమం ఇరవై నుంచి 25 కోట్లు అయినా లాభం లేకపోతే పెద్ద సినిమాలు చేయటం అనవసరం అని అందుకు తగ్గ జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచిస్తాన్నారట. అందుకోసమే ఆయన మెహర్ రమేష్, వివి వినాయిక్,బాబి వంటి ఫామ్ లో లేని దర్శకులతో సినిమాలు చేస్తున్నారట. అలా అయితే ఎక్కువ రెమ్యునేషన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండదని ఆయన అభిప్రాయంగా చెప్తున్నారు. అంతేకాకుండా ప్రొడక్షన్ పై అనసరంగా పదిపైసలు కూడా ఖర్చు పెట్టద్దు అని చెప్తున్నారట.
ఈ స్కీమ్ ని వాస్తవానికి పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా అమలు చేస్తున్నారు. ఆయన పనిచేసే డైరక్టర్స్ ని చూస్తే ఆ విషయం మనకు అర్దమవుతుంది. బాబి, వేణు శ్రీరామ్, డాలీ ఇలా ఆయన స్దాయిలో లేని చిన్న డైరక్టర్స్ తో ఆయన పనిచేస్తున్నారు. లాభాలు తన నిర్మాతలుకు చూపించగలుగుతున్నారు. చిరంజీవి కూడా అదే పద్దతిలో వెల్తున్నారు. అందుకే రీమేక్ లుని ఎంచుకుంటూ ఫామ్ లోలేని దర్శకులతో సినిమా లు కమిటవ్వుతున్నారు. ఓ రకంగా ఆ దర్శకులకు కూడా లైఫ్ ఇచ్చినట్లు అవుతుంది. తమను తాము ప్రూవ్ చేసుకునేందుకు వీలుంటుంది.