మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక పద్మవిభూషణ్ అవార్డుకి ఎంపికైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చిరంజీవికి ఓ అభిమాని వినూత్నంగా అభినందనలు తెలిపాడు.   

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత ప్రభుత్వం పద్మ అవార్డుల ప్రకటన చేసింది. మెగాస్టార్ చిరంజీవిని పద్మవిభూషణ్ చే గౌరవించడం జరిగింది. రెండో అతిపెద్ద పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ చిరంజీవికి రావడంపై అభిమానులు, ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నారు. 

కాగా న్యూయార్క్ కి చెందిన ఓ అభిమాని వినూత్నంగా అభినందనలు తెలియజేశాడు. ప్రఖ్యాత న్యూయార్క్ టైం స్క్వేర్ స్ట్రీట్ లో చిరంజీవి ఫోటో ప్రదర్శించాడు. ప్రతిష్టాత్మక సివిలియన్ అవార్డు పద్మవిభూషణ్ అందుకున్న చిరంజీవికి శుభాకాంక్షలు అంటూ ఫోటోలు ప్రదర్శనకు పెట్టాడు. కుందవరపు శ్రీనివాస్ నాయుడు అనే ఎన్నారై ఈ విధంగా అభిమానం చాటుకున్నాడు. 

కాగా చిరంజీవి 2006లో పద్మభూషణ్ అవార్డుకి ఎంపికయ్యారు. తాజాగా ఆయనకు పద్మవిభూషణ్ రూపంలో మరో అరుదైన గౌరవం దక్కింది. అయితే చిరంజీవిని బాలకృష్ణ, రజినీకాంత్, అమితాబ్ వంటి స్టార్స్ అభినందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. టాలీవుడ్ కి చెందిన మరికొందరు ప్రముఖులు సైతం దీనిపై స్పందించలేదు. 

మరోవైపు చిరంజీవి విశ్వంభర టైటిల్ తో ఒక చిత్రం చేస్తున్నాడు. బింబిసార ఫేమ్ వశిష్ఠ ఈ చిత్ర దర్శకుడు. సోషియో ఫాంటసీ సబ్జెక్టుతో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. విశ్వంభర మూవీలో ముగ్గురు హీరోయిన్స్ వరకూ నటించే అవకాశం ఉందట. చిరంజీవి మూడు లోకాల్లో సంచరిస్తారంటూ ప్రచారం జరుగుతుంది. విశ్వంభర 2025 సంక్రాంతి కానుకగా విడుదల కానుందని సమాచారం. 
 

Scroll to load tweet…