Asianet News TeluguAsianet News Telugu

దర్శకుడు కె వాసు లేరనే వార్త బాధించిందిః చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌ సంతాపం..

సీనియర్‌ దర్శకుడు కె వాసు మృతి పట్ల టాలీవుడ్‌ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తుంది. తాజాగా మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌ స్పందించారు. కె వాసు మృతి పట్ల సంతాపం తెలిపారు.

chiranjeevi pawan send deep condolences to senior director k vasu death arj
Author
First Published May 26, 2023, 10:18 PM IST

సీనియర్‌ దర్శకుడు కె వాసు ఈ రోజు హఠాన్మరణం చెందారు. తెలుగు చిత్ర పరిశ్రమలో శోకసంద్రంలో ముంచెత్తారు. ఆయన మృతి పట్ల టాలీవుడ్‌ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తుంది. తాజాగా మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌ స్పందించారు. కె వాసు మృతి పట్ల సంతాపం తెలిపారు. `సీనియర్ దర్శకులు కె.వాసు ఇక లేరు అనే వార్త ఎంతో బాధించింది. నా కెరీర్ తొలి రోజుల్లో  చేసిన  `ప్రాణం ఖరీదు`, `తోడుదొంగలు` , `అల్లుళ్లు వస్తున్నారు`, `కోతల రాయుడు` చిత్రాలకి ఆయన దర్శకత్వం వహించారు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం` అని ట్విట్టర్‌ ద్వారా తన విచారం వ్యక్తం చేశారు చిరు. చిరంజీవి నటుడిగా టాలీవుడ్‌కి పరిచయం అయ్యింది `ప్రాణం ఖరీదు` సినిమాతోనే అనే విషయం తెలిసిందే. ఓ రకంగా చిరుని టాలీవుడ్‌కి పరిచయం చేశారని చెప్పొచ్చు. 

మరోవైపు పవన్‌ కళ్యాణ్‌ తన విచారం వ్యక్తం చేస్తూ, దర్శకులు కె.వాసు కన్నుమూశారని తెలిసి చింతించాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా. అన్నయ్య చిరంజీవి  ముఖ్య పాత్రలో నటించిన `ప్రాణం ఖరీదు` సినిమా దర్శకులుగా వాసుని మరచిపోలేం. చిరంజీవి  తొలిసారి వెండి తెరపై కనిపించింది ఆ సినిమాతోనే. వినోదాత్మక కథలే కాకుండా భావోద్వేగ అంశాలను తెరకెక్కించారు. కె.వాసు సినిమాల్లో `శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం` ప్రత్యేకమైనది. తెలుగునాట షిర్డీ సాయిబాబా చరిత్ర ప్రాచుర్యం పొందటంలో ఆ సినిమా ఓ ముఖ్య కారణమైంది` అంటూ వారి కుటుంబానికి సంతాపం తెలియజేశారు పవన్‌. 

1974లో `ఆడపిల్లల తండ్రి` చిత్రంతో దర్శకుడిగా మారారు కె వాసు. ఇందులో కృష్ణంరాజు, నాగభూషణం, భారతి ప్రధాన పాత్రల్లో నటించారు. దీనికి దర్శకత్వం వహించడమే కాదు, నిర్మాతగా, రచయితగా వర్క్ చేసి చిన్న వయసులోనే మూడు విభాగాల్లో పనిచేసిన దర్శకుడిగా రికార్డు క్రియేట్‌ చేశారు కె వాసు. ఆ తర్వాత కొంత గ్యాప్‌తో చిరంజీవి, జయసుధ, చంద్రమోహన్‌, మాధవి, నూతన్‌ ప్రసాద్‌, రావు గోపాలరావు లు నటించిన `ప్రాణం ఖరీదు` చిత్రానికి దర్శకత్వం వహించి మెప్పించారు. ఈ సినిమాతో చిరంజీవి నటుడిగా వెండితెరకు పరిచయం అయిన విషయం తెలిసిందే.

వీటితోపాటు `అమెరికా అల్లుడు`, `శ్రీషిరిడీ సాయిబాబా మహత్యం`, `ఇంట్లో శ్రీమతి వీధిలోకుమారి`, `అల్లుళ్లొస్తున్నారు`, `కోతల రాయుడు`, `ముద్దూ ముచ్చట`, `ఒక చల్లని రాత్రి`, `ఆరని మంటలు`, `సరదా రాముడు`, `గోపాలరావుగారి అమ్మాయి`, `దేవుడు మామయ్య`, `కలహాల కాపురం` వంటి పలు హిట్ చిత్రాలకు కే. వాసు దర్శకుడిగా పనిచేశారు. టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసుకున్నారు. ఆయన చివరగా 2008లో `గజిబిజి` చిత్రాన్ని రూపొందించారు. అంతకు ముందు శ్రీకాంత్‌,ప్రభుదేవాలతో `ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి` చిత్రాన్ని తీశారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios