సమంత నిర్వహించే `సామ్‌జామ్` టాక్ షోలో చిరంజీవి పాల్గొన్నారు. ఇలాంటి షోలో పాల్గొనడం చిరంజీవికి మొదటిసారి కావడం విశేషం. అయితే ఇందులో చిరు ఏం చెప్పబోతున్నాడనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. తాజాగా చిరంజీవికి సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు ఆహా` నిర్వహకులు.
చిరంజీవి డిజిటల్ ఫ్లాట్‌ఫామ్ `ఆహా`లో కనిపించబోతున్నారు. సమంత నిర్వహించే `సామ్‌జామ్` టాక్ షోలో చిరంజీవి పాల్గొన్నారు. ఇలాంటి షోలో పాల్గొనడం చిరంజీవికి మొదటిసారి కావడం విశేషం. అయితే ఇందులో చిరు ఏం చెప్పబోతున్నాడనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. తాజాగా చిరంజీవికి సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు ఆహా` నిర్వహకులు. ఇందులో సమంత, చిరు మధ్య ఓ కన్వర్జేషన్ ఆసక్తిని రేకెత్తిస్తుంది.
ఇందులో సమంత `మీ ఫ్రిజ్‌లో రెగ్యులర్‌గా ఉండే ఒక ఐటెమ్ ఏంటి` అని అడగ్గా.. చిరు ఇలా తీసి గ్లాస్‌లో వేసి తాగినట్టుగా చేయి సైగలతో చెప్పారు. దీంతో సమంతతోపాటు అక్కడికి వచ్చిన ప్రేక్షకులంతా బాగా పగలబడి నవ్వారు. అది మందు అని అంతా భావించారు. అయితే దీన్ని కవర్ చేసేందుకు చిరు మీరనేది కాదు.. మీరనుకునేది కాదంటూ దాన్ని సరిచేసే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో బాగా వైరల్ అవుతుంది. ఈ నెల 25న క్రిస్మస్ కానుకగా ఈ చిరంజీవి ఎపిసోడ్ టాక్ షో ప్రసారం కానుంది.
Get ready to watch the MEGASTAR like never before on DECEMBER 25.
— ahavideoIN (@ahavideoIN) December 19, 2020
Worth the wait! Stay excited.
Megastar @KChiruTweets @Samanthaprabhu2 @thesamjamshow #SamJamMegaEpisode #SamJamOnAHA #SantaSam pic.twitter.com/dg2lj1DwKB
చిరంజీవి ప్రస్తుతం `ఆచార్య` చిత్రంలో నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. కాజల్ హీరోయిన్‌గా నటిస్తుంది. శరవేగంగా ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటోంది. దీంతోపాటు నెక్ట్స్ సినిమాగా `లూసీఫర్` రీమేక్ ని ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. తమిళ దర్శకుడు మోహన్‌రాజా దీనికి దర్శకత్వం వహించనున్నారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Dec 20, 2020, 2:03 PM IST