కాగా నేడు కైకాల సత్యనారాయణ బర్త్ డే నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ఆయనను కలిశారు.
నాటితరం నటులలో కురువృద్దులు కైకాల సత్యనారాయణ ఒకరు. ఈ లివింగ్ లెజెండ్ సుదీర్ఘ కెరీర్ లో అనేక వైవిధ్యమైన పాత్రలు చేశారు. హీరోగా, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా వందల చిత్రాలలో నటించారు. అనేక పౌరాణిక పాత్రలు చేసిన సత్యనారాయణ యముడి పాత్రకు పెట్టింది పేరు. యముడు పాత్రకు ఆయన బ్రాండ్ అంబాసడర్ గా ఉన్నారు. కాగా నేడు కైకాల సత్యనారాయణ బర్త్ డే నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ఆయనను కలిశారు.
చిరంజీవి స్వయంగా కైకాల సత్యనారాయణ నివాసానికి సతీ సమేతంగా వెళ్లి కలవడం జరిగింది. అలాగే ఆయనను చిరంజీవి దంపతులు సత్కరించడంతో పాటు, బర్త్ డే విషెష్ తెలియజేశారు. ఇక సోషల్ మీడియా వేదికగా చిరంజీవి ఆయనతో ఉన్న ఫోటో పంచుకోవడంతో పాటు, కామెంట్ రోపంలో ఆయనపై ఉన్న అభిమానం చాటుకున్నారు.
''తెలుగు సినిమా ఆణిముత్యం, నవరస నటనా సార్వభౌముడు, నాకు అత్యంత ఆప్తులు కైకాల సత్యనారాయణ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని,ఈ రోజు నేను,నా సతీమణితో కలిసి ఆయన ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేసి కాసేపు ఆయనతో ముచ్చటించడం ఓ మధురమైన అనుభూతి'' సత్యనారాయణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.. అంటూ చిరు ట్వీట్ చేశాడు. సీనియర్ నటుడిని గుర్తుపెట్టుకొని స్వయంగా బర్త్ డే విషెష్ తెలిపిన చిరంజీవి పై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.
