మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ సైరా షూటింగ్ ముగిసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రేక్షకులని అబ్బురపరిచేలా ఉండడం కోసం సైరా చిత్ర యూనిట్ కష్టపడుతోంది. ఇదిలా ఉండగా మెగాస్టార్ తన కొత్త చిత్రానికి కసరత్తులు ప్రారంభించేశాడు. 

త్వరలో కొరటాల శివ దర్శకత్వంలో చిరు నెక్స్ట్ మూవీ ప్రారంభం కానుంది. ఈ చిత్రం కోసం బరువు తగ్గాలని కొరటాల చిరుకి సూచించాడట. దీనితో సల్మాన్ ఖాన్ ప్రత్యకంగా పంపిన ట్రైనర్ ఆధ్వర్యంలో చిరంజీవి జిమ్ లో కష్టపడుతో ఆహార నియమాలు పాటిస్తున్నాడట. 

తాజాగా చిరంజీవి లేటెస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిరు స్లిమ్ లుక్ లో అదరగొడుతున్నాడు. మరి కొద్దిరోజులు జిమ్ లో కష్టపడితే మెగాస్టార్ పూర్తిగా యంగ్ లుక్ లోకి వచ్చే అవకాశం ఉంది.