ఫ్లాప్ డైరెక్టర్ కథని ఓకె చేసిన చిరంజీవి.. ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు ఫిక్స్ ?

మెగాస్టార్ చిరంజీవికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనితో మెగా ఫ్యామిలిలో, అభిమానుల్లో సంబరాలు నెలకొన్నాయి. ప్రస్తుతం చిరు బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Chiranjeevi gives green signal to bvs ravi story dtr

మెగాస్టార్ చిరంజీవికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనితో మెగా ఫ్యామిలిలో, అభిమానుల్లో సంబరాలు నెలకొన్నాయి. ప్రస్తుతం చిరు బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చిరంజీవి కెరీర్ లో భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. 

విజువల్ వండర్ భారీ విఎఫెక్స్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ముల్లోకాలు వీరుడిగా చిరు ఈ చిత్రంలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే చిరంజీవి తదుపరి చిత్రానికి సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి. ప్రస్తుతం చిరు కథలు లాక్ చేసే పనిలో ఉన్నారు. 

అయితే తాజా సమాచారం మేరకు రచయిత, డైరెక్టర్ బివిఎస్ రవి రీసెంట్ గా చిరంజీవికి కథ వినిపించారట. ఆ కథకి చిరు చాలా ఎగ్జైట్ అయినట్లు తెలుస్తోంది. దీనితో పూర్తిస్థాయిలో స్క్రిప్ట్ రెడీ చేయమని చిరు తన అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ స్క్రిప్ట్ లాక్ అయితే బివిఎస్ రవి డైరెక్ట్ చేయడు. ఎందుకంటే రవికి దర్శకుడిగా అంత మంచి పేరు లేదు. 

సాయిధరమ్ తేజ్ తో బివిఎస్ రవి తెరకెక్కించిన జవాన్ చిత్రం తీవ్రంగా నిరాశ పరిచిన సంగతి తెలిసిందే. ఈ కథని డైరెక్టర్ చేసేందుకు ప్రధానంగా ఇద్దరు దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి. ఒకరు హరీష్ శంకర్ కాగా మరొకరు కళ్యాణ్ కృష్ణ. ఇద్దరూ చిరుతో సినిమా చేసేందుకు ఎదురుచూస్తున్నారు. కళ్యాణ్ కృష్ణ దర్శకుడిగా సుష్మిత కొణిదెల నిర్మాణంలో చిరంజీవి ఒక చిత్రం చేయాల్సి ఉంది. మరి బివిఎస్ రవి కథతో ఆ చిత్రం పట్టాలెక్కుతుందేమో చూడాలి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios