చిరంజీవి వరస పెట్టి రీమేక్ సినిమాలు చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే అవి ఎప్పుడు మొదలవుతాయి...ఏ డైరక్టర్ చేయబోతున్నారు..అసలు బయిటవినపడుతున్న వార్తల్లో నిజమెంత అనే విషయాలను చిరంజీవి తాజాగా డక్కన్ క్రానికల్ కు ఇచ్చిన ఇంటర్వూలో క్లారిటీ ఇచ్చే  ప్రయత్నం చేసారు.

చిరంజీవి మాట్లాడుతూ.. తాను తమిళ హిట్ వేదాళం, మళయాళ బ్లాక్ బస్టర్ లూసిఫర్ రెండు రీమేక్ లు చేయబోతున్నట్లు తెలియచేసారు. అయితే ఈ రెండు రీమేక్ సినిమాలు పట్టాలు ఎక్కబోయేది వచ్చే సంవత్సరమే అన్నారు. మెహర్ రమేష్ కు వేదాళం రీమేక్ అప్పచెప్పామని, వివి వినాయిక్..లూసిఫర్ రీమేక్ సినిమా చేస్తున్నారని అన్నారు.

వేదాళం రీమేక్ కు  సంభందించి మెహర్ రమేష్, ఆయన రైటింగ్ చేసిన స్క్రిప్టు మార్పులు బాగా వచ్చాయని ,తాను ఇంప్రెస్ అయ్యానని వివరించారు. 
 
అలాగే తన కుమారుడు రామ్ చరణ్ ..ఆచార్య చిత్రంలో చేయటం గురించి చెప్తూ...త్వరలోనే షూట్ లో రామ్ చరణ్ జాయిన్ అవుతారని అన్నారు. చరణ్ ..ఆచార్యలో క్యారక్టర్ చేస్తున్నారు. అందులో మార్పేమీ లేదని తెలియచేసారు. అలాగే ఆచార్య చిత్రం రిలీజ్ గురించి చెప్తూ ఏప్రియల్ రిలీజ్ కు రెడీ అవుతుందని హింట్ ఇచ్చారు.