భోళా శంకర్ చిత్రం ఆగష్టు 11న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది.ఆదివారం రోజు హైదరాబాద్ శిల్పకళా వేదికలో గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. 

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'భోళా శంకర్'. మెహర్ రమేష్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత చిరు నటిస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. భోళా శంకర్ చిత్రం ఆగష్టు 11న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది.ఇటీవల విడుదలైన ట్రైలర్ కూడా అదిరిపోయింది. ఆదివారం రోజు హైదరాబాద్ శిల్పకళా వేదికలో గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. 

ప్రీ రిలీజ్ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ కీర్తి సురేష్ గురించి చెప్పిన మాటలు చాలా సరదాగా ఉన్నాయి. కీర్తి సురేష్ ని ప్రశంసిస్తూనే ఆమెపై ఫన్నీ సెటైర్లు వేశారు చిరు. చిరు మాట్లాడుతూ అన్నా చెలెళ్ళుగా నటించాము. సోదర ప్రేమ వచ్చేస్తోంది. కానీ నేనే ఆపుకుంటున్నా. ఎందుకంటే తర్వాతి చిత్రాల్లో ఆమె నాతో హీరోయిన్ గా చేయాలనే కోరిక ఉంది. అందుకే అన్నా చెల్లుల్లు అనే భావన అప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. నువ్వు కూడా అన్నయ్య అనే ఫీలింగ్ తీసేయ్.. నీకు అన్నయ్యగా మెహర్ రమేష్ ఉన్నాడు.. నేను కాదు.. అని కీర్తి సురేష్ కి మొదటి రోజే చెప్పేశాను అని చిరంజీవి సరదా కామెంట్స్ చేశారు. 

కీర్తి సురేష్ తూతూ మంత్రంగా సెట్స్ కి వచ్చి వెళ్లిపోయే నటి కాదు. వాళ్ళ అమ్మతో నేను పున్నమినాగు చిత్రంలో నటించాను. ఆ అనుబంధం వాళ్ళ ఫ్యామిలీతో కొనసాగుతోంది. ఈ క్రమంలో కీర్తి సురేష్ ఎదుగుదల చూస్తూనే ఉన్నాం. కానీ మహానటి సినిమా చూసినప్పుడు మాత్రం మంత్రముగ్దుడ్ని అయ్యా. మహానటి చిత్ర యూనిట్ ని పిలిచి అభినందించా. కీర్తి సురేష్ కి జాతీయ అవార్డు వస్తుందని అప్పుడే చెప్పా. నేను చెప్పినట్లుగానే ఆమెకి జాతీయ అవార్డు దక్కింది అని చిరు అన్నారు. కీర్తి సురేష్ ఇలాగే కొనసాగాలి. భోళా శంకర్ లో ఆమె ఒప్పుకుని నటించినందుకు హ్యాట్సాఫ్. 

రోజూ మా ఇంటి ఫుడ్డు తిని కీర్తి సురేష్ కి గ్లామర్ బాగా పెరిగింది అని కూడా చిరు సరదాగా కామెంట్స్ చేశారు. చిరు తన గురించి మాట్లాడుతున్నప్పుడు కీర్తి సురేష్ పక్కనే నిలబడి నవ్వుకుంటూ ఉంది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.