మెగాస్టార్ చిరంజీవితో హీరో సిద్ధూ జొన్నలగడ్డకు ఫ్యాన్ బాయ్ మూమెంట్ కలిగింది. చిరును కలిసిన సందర్భంగా టిల్లు వేశాలకు ఫన్నీ కామెంట్లు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
మెగాస్టార్ చిరంజీవి Chiranjeeviని ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ Padma Vibhushan అవార్డుకు ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు పెద్దఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అదీగాక సినీ ప్రముఖులు చిరును ప్రత్యేకంగా కలిసి విషెస్ తెలుపుతున్నారు. ఇప్పటికే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, వరుణ్ తేజ్ తదితరులు మెగాస్టార్ ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ Siddhu Jonnalagadda కూడా మెగాస్టార్ ను కలిశారు.
ఈ సందర్బంగా మెగాస్టార్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. అంతే కాకుండా సెల్ఫీ దిగి ఫ్యాన్ బాయ్ మూమెంట్ ను ఫీలయ్యాడు. అయితే.. టిల్లు చేసిన పనికి మెగాస్టార్ ఫన్నీ కామెంట్స్ చేశారు... సెల్ఫీ దిగే ముందు జుట్టును సర్దుకున్నాడు. దీంతో చిరంజీవి ‘జుట్టు చెరిపోయేడం కాదమ్మ సర్దుకోవాలి’ అని సూచించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇలా చిరు ఇటీవల ఎక్కడ కనిపించినా తన పంచులు, ప్రాసలు, ఫన్నీ కామెంట్స్ తో ఆకట్టుకుంటున్నారు. తెలంగాణ ఎలక్షన్స్ ఓటింగ్ డేన కూడా తన కామెడీ టైమింగ్ తో కడుపుబ్బా నవ్వించారు.
ఇక మెగాస్టార్ చిరంజీవి వరుస పెట్టి సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. చివరిగా ‘వాల్తేరు వీరయ్య’, ‘భోళా శంకర్’ చిత్రాలతో అలరించారు. నెక్ట్స్ మరో రెండు సినిమాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ‘బింబిసారా’ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో మెగా156 ‘విశ్వంభర’ Vishwambara చిత్రంలో నటిస్తున్నారు. సోషియో ఫాంటసీగా రూపుదిద్దుకుంటోంది. ప్రస్తుతం షూటింగ్ మొదలైంది. ఇక సిద్దూ నెక్ట్స్ ‘టిల్లు స్క్వేర్’ Tillu Square, తెలుసు కదా Telusu Kada చిత్రాల్లో నటిస్తూ బిజిగా ఉన్నారు. ఇక ‘టిల్లు స్క్వేర్’ మూవీ మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.
