Asianet News TeluguAsianet News Telugu

‘ఓడిద్దాం’ : చిరంజీవి, అక్షయ్ కుమార్ కలిసి...!

‘హర్ ఘర్ నే థానా హై, కరోనా కో హరానా హై’ అంటున్నారు మన చిరంజీవి, బాలీవుడ్ స్టార్ అక్షయ్, తమిళ స్టార్ ఆర్య, కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్!

Chiranjeevi feature in ficci covid campaign jsp
Author
Hyderabad, First Published Jun 5, 2021, 2:36 PM IST

కరోనా ఫస్ట్ వేవ్ వచ్చి వెళ్ళింది.  జనం ఇంకేం కాదులే అంటూ రిలాక్స్ అయ్యారు. దాంతో సెకండ్ వేవ్ తో కల్లోలం సృష్టించింది. కరోనా రెండో వేవ్ లో మన దేశంలో కేసులు వేగంగా పెరిగాయి.  దేశంలో 80 శాతం కరోనా కేసులు పెరగడానికి ప్రజల నిర్లక్ష్యమే కారణం అని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. మాస్క్ లు పెట్టుకోక పోవడం.. ఆరుబయట తిరగడం.. శానిటైజేషన్ లేకపోవడం, తీసుకునే పదార్థాల, గాలి, నీరు, ఇతరుల ద్వారా వ్యాపించడం ముఖ్య కారణాలుగా చెబుతున్నారు వారు.

 కారణాలుల ఏమైతేనేం మొత్తానికి  ఎలాగో నానా తంటాలు పడి రెండో కరోనా సునామీని కూడా తగ్గించగలిగాం. కానీ, కథ ఇంతటితో ముగిసిపోలేదు. ‘హర్ ఘర్ నే థానా హై, కరోనా కో హరానా హై’ అంటున్నారు మన చిరంజీవి, బాలీవుడ్ స్టార్ అక్షయ్, తమిళ స్టార్ ఆర్య, కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్!

‘ద ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ’ (ఫిక్కీ) కరోనాకు వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నడుం బిగించింది. సెకండ్ వేవ్ క్రమంగా క్షిణిస్తున్నప్పటికీ ముందు ముందు మరింత జాగ్రత్తగా ఉండాలంటూ హిందీ, మరాఠీ, పంజాబీ, తెలుగు, తమిళం, కన్నడ వంటి భాషల్లో ప్రచారం చేయనున్నారు. ఇందుకుగానూ మెగాస్టార్ చిరంజీవి, ‘ఖిలాడీ’ అక్షయ్ కుమార్, ఆర్య, పునీత్ రాజ్ కుమార్ లాంటి పాప్యులర్ హీరోలతో క్యాంపైన్ ప్రాంభించారు.

 జూన్ 5 నుంచీ టీవీ, పేపర్, ఇంటర్నెట్ లాంటి మాస్ మీడియా ప్లాట్ ఫామ్స్ పైన స్పెషల్ కరోనా అవేర్ నెస్ యాడ్స్ ప్రసారం అవుతాయి. హిందీ, మరాఠీ, పంజాబీ భాషల్లో అక్షయ్ కుమార్ ‘కరోనా కో హరానా హై’ అంటే… తమిళంలో ఆర్య, కన్నడలో పూనీత్ రాజ్ కుమార్ తమ ప్రజలకి మహమ్మారిని ఓడిద్దాం అంటూ సందేశం ఇస్తారు. ఇక తెలుగులో చిరంజీవి ఫిక్కీ తరుఫున ప్యాండమిక్ టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో చెప్పనున్నారు! 
 

Follow Us:
Download App:
  • android
  • ios