మెగా కాంపౌండ్ నుండి వచ్చే హీరోలు చాలా మంది వెండితెరపై తమ మార్కు చూపుతున్నారు. వైష్ణవ్ తేజ్ అయితే మెగా హీరోలందరిని కాదని బ్లాక్ బస్టర్ హిట్ తో ఎంట్రీ ఇచ్చాడు. ఆయన నటించిన ఉప్పెన రికార్డు వసూళ్లు రాబట్టింది. ఓ స్టార్ హీరో రేంజ్ సినిమా వసూళ్లు ఉప్పెన చిత్రంతో ఆయన కొల్లగొట్టాడు. దర్శకుడు సానా బుచ్చి బాబు ఒక్క సినిమాతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యాడు. అలాగే హీరోయిన్ కృతి శెట్టి సైతం పాపులారిటీ తెచ్చుకున్నారు. ఆమెకు పరిశ్రమలో వరుస ఆఫర్స్ వస్తున్నాయి. 


కాగా ఉప్పెన చిత్రం చూసిన మెగాస్టార్ చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. అద్భుత చిత్రం కోసం పనిచేసిన చిత్ర యూనిట్ కి ఆయన బహుమతులు, ప్రశంసా పత్రాలు కూడా పంపడం జరిగింది. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ, డైరెక్టర్ బుచ్చి బాబు మరియు హీరోయిన్ కృతి శెట్టికి చిరంజీవి అభినందన లేఖలు, చిరు గిఫ్ట్ లు పంపించారు. 


తాజాగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ కి చిరంజీవి బహుమతి ఇచ్చారు. అందమైన ఓ కాస్ట్లీ వాచ్ ని వైష్ణవ్ కి ఇవ్వడం జరిగింది.దీనితో వైష్ణవ్ ఉబ్బితబ్బిబయ్యాడు. తన ఆనందాన్ని వైష్ణవ్ తేజ్.. సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. చిరుతో దిగిన ఫొటోతో పాటు థాంక్ యూ మామయ్య అంటూ కామెంట్ చేశాడు. వైష్ణవ్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.