Golden Globe: చారిత్రాత్మక విజయమన్న చిరు, అద్బుతమన్న ఏ ఆర్ రెహమాన్... ఆర్ ఆర్ ఆర్ టీమ్ కి శుభాకాంక్షల వెల్లువ!
ప్రపంచ సినిమా వేదికపై ఆర్ ఆర్ ఆర్ విజయాన్ని ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ సెలబ్రేట్ చేసుకుంటుంది. నాటు నాటు సాంగ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ అందుకోగా... చిరంజీవి, ఏ ఆర్ రెహమాన్ తో పాటు పలువురు ప్రముఖులు బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు.

ఆర్ ఆర్ ఆర్ టీమ్ కి అభినందనలు వెల్లువెత్తున్నాయి. నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకోగా... భారతీయ చిత్ర వర్గాలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దీన్ని అతి పెద్ద విజయంగా అభివర్ణిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా సంతోషం వ్యక్తం చేశారు. ఆర్ ఆర్ ఆర్ గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలవడం చారిత్రాత్మక విజయం అంటూ కొనియాడారు.
ఇక లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ సైతం ఈ అరుదైన సంఘటనపై స్పందించారు. నాటు నాటు సాంగ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డుకి ఎంపిక కావడం అద్భుతమంటూ ప్రశంసించారు. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణికి ఆయన కంగ్రాట్స్ చెప్పారు. కాగా ఏ ఆర్ రెహమాన్ 2009లో స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రానికి గాను గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్నారు.
ఆర్ ఆర్ ఆర్ హీరో ఎన్టీఆర్ సైతం ఈ ఈవెంట్లో పాల్గొన్నారు. కీరవాణి ఈ ప్రతిష్టాత్మక అవార్డు అందుకోవడం పై స్పందించారు. మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు అని ఎన్టీఆర్ కీరవాణిని పొగడ్తలతో ముంచెత్తారు. కేరీర్లో ఎన్ని పాటలకు డాన్స్ చేశాను. నాటు నాటు మాత్రం చాలా స్పెషల్ అని చెప్పుకొచ్చారు.
రాజకీయ ప్రముఖులు సైతం స్పందిస్తున్నారు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా ప్రతి ఇండస్ట్రీ ఈ విజయాన్ని సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలుపుతున్నారు.
రాజమౌళి దర్శకుడిగా ఆర్ ఆర్ ఆర్ తెరకెక్కింది. పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించారు. డివివి దానయ్య నిర్మించారు. అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటించారు. అజయ్ దేవ్ గణ్, శ్రీయా కీలక రోల్స్ చేశారు.
ఆర్ ఆర్ ఆర్ అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతుంది. పలు ఇంటర్నేషనల్ అవార్డ్స్ సొంతం చేసుకుంది. తాజాగా గోల్డెన్ గ్లోబ్ అవార్డుతో అరుదైన మైలురాయిని చేరుకుంది. దర్శకుడు రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి గాను న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డు గెలుపొంచారు.
గోల్డెన్ గ్లోబ్ విజయంతో ఆస్కార్ పై ఆశలు బలపడ్డాయి. ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు ఆస్కార్స్ కి షార్ట్ లిస్ట్ అయ్యింది. నాటు నాటు నామిషన్స్ సాధించడంతో పాటు ఆస్కార్ గెలుచుకుంటుందని చిత్ర వర్గాలు భావిస్తున్నాయి.