మెగాస్టార్ చిరంజీవి అంటే గొప్ప నటుడు మాత్రమే కాదు.. ఆయనలో మానవతావాది కూడా గుర్తుకు వస్తారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ కష్టాల్లో ఉన్న వారికి లేదా తన దృష్టికి వచ్చిన సంఘటనలపై నేను ఉన్నాను అంటూ ఆపన్న హస్తం అందించడం చిరంజీవి గొప్ప వ్యక్తిత్వానికి నిదర్శనం.
మెగాస్టార్ చిరంజీవి అంటే గొప్ప నటుడు మాత్రమే కాదు.. ఆయనలో మానవతావాది కూడా గుర్తుకు వస్తారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ కష్టాల్లో ఉన్న వారికి లేదా తన దృష్టికి వచ్చిన సంఘటనలపై నేను ఉన్నాను అంటూ ఆపన్న హస్తం అందించడం చిరంజీవి గొప్ప వ్యక్తిత్వానికి నిదర్శనం. మంచి పని ఎవరు చేసినా చిరంజీవి ప్రోత్సహిస్తారు.. అభినందిస్తారు అనేందుకు మరో ఉదాహరణ వచ్చింది.
రోడ్డుపై కుప్పకూలిన యువకుడి పట్ల సమయస్ఫూర్తితో వ్యవహరించి అతడి ప్రాణాలు కాపాడారు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ రాజశేఖర్. దీనితో రాజశేఖర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారారు. రోడ్డుపై అకస్మాత్తుగా ఓ యువకుడు పడిపోగా రాజశేఖర్ అతడికి సీఆర్పీ అందించారు. దీనితో ఆ యువకుడి ప్రాణాలు నిలిచాయి. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ పోలీస్ రాజశేఖర్ ని కొనియాడుతూ పోస్ట్ లు పెడుతున్నారు.
మెగాస్టార్ చిరంజీవి కూడా ట్విట్టర్ వేదికగా రాజశేఖర్ ని అభినందించారు. ' సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ రాజశేఖర్ కి నా సెల్యూట్. అతడు ఎంతో చురుకుగా వ్యవహరించి.. సీఆర్పీ చేసి ఒక ప్రాణం నిలబెట్టాడు. రాజశేఖర్ తన కర్తవ్యానికి మించి పనిచేసారు. మానవత్వం చూపించారు. రక్షణలో, ఫ్రెండ్లిపోలీసింగ్ లో ఉదాహరణగా నిలిచారు అంటూ చిరంజీవి ట్విట్టర్ లో ప్రశంసలు కురిపించారు.
చిరంజీవి చేసిన ఈ ట్వీట్ పట్ల మెగా అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సేవ చేయడంలో, చేసిన వారిని అభినందించడంలో మెగాస్టార్ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా ట్రాఫిక్ పోలీస్ రాజశేఖర్ ఈ సంఘటనతో రియల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు.
