నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు(ఎన్టీఆర్‌)కి భారతరత్న ఇవ్వాలని డిమాండ్‌ చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఎన్టీఆర్‌కి ఆ గౌరవం దక్కితే అది తెలుగువారికే గౌరవమన్నారు. నేడు ఎన్టీఆర్‌ 98వ జయంతి. ఈ సందర్భంగా ఆయనకు నివాళ్లు అర్పిస్తూ ఎన్టీఆర్‌ని గుర్తు చేసుకున్నారు చిరంజీవి. ఈ మేరకు చిరు ట్విట్టర్‌ ద్వారా ఓ పోస్ట్ పెట్టారు. 

ఇందులో చిరంజీవి చెబుతూ, `ప్రముఖ గాయకులు నవయుగ వైతాళికులు భూపేన్‌ హజారికా గారికి మరణాంతరం భారతరత్న ఇచ్చినట్టు, మన తెలుగు తేజం, దేశం గర్వించే నాయకుడు నందమూరి తారక రామారావుగారికి భారతరత్న ఇస్తే అది తెలుగువారందరికీ గర్వకారణం. వారి నూరవ జన్మదినం దగ్గర పడుతున్న సందర్భంగా ఎన్టీఆర్‌కి ఈ గౌరవం దక్కితే అది తెలుగు వారికి దక్కే గౌరవం అవుతుంది. ఆ మహానుభావుడి 98వ జన్మదిన సందర్భంగా స్మరించుకుంటూ` అని పేర్కొన్నారు చిరంజీవి.