రాంచరణ్, ఉపాసన దంపతులు ఇటీవల తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. ఉపాసన జూన్ 20న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. దీనితో మెగా ఫ్యామిలీతో పాటు అభిమానులు కూడా సంతోషంలో మునిగితేలారు.

రాంచరణ్, ఉపాసన దంపతులు ఇటీవల తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. ఉపాసన జూన్ 20న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. దీనితో మెగా ఫ్యామిలీతో పాటు అభిమానులు కూడా సంతోషంలో మునిగితేలారు. స్వయంగా రాంచరణ్ మీడియా ముందుకు వచ్చి తన సంతోషాన్ని పంచుకున్నారు. 

కాగా నేడు కొణిదెల వారి ఇంట మెగా ప్రిన్సెస్ కి బారసాల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నామకరణం కూడా చేశారు. తన కుమార్తెకి పేరు ఆల్రెడీ ఫిక్స్ అయినట్లు కూడా చరణ్ పాప పుట్టినప్పుడు ప్రకటించారు. దీనితో మెగా వారసురాలి ఎలాంటి పేరు పెడతారు అనే ఉత్కంఠ ప్రతి ఒక్కరిలో నెలకొంది. 

ఆ ఉత్కంఠకి తెరదించుతూ చిరంజీవి తన మనవరాలి పేరు ప్రకటించారు. చరణ్, ఉపాసన దంపతుల కుమార్తె పేరు 'క్లిన్ కారా కొణిదెల'. వినడానికి కాస్త విచిత్రంగా ఉన్నప్పటికీ ట్రెండీగా కూడా అనిపిస్తోంది. కానీ ఈ పేరు ట్రెండీగా పెట్టింది కాదు. సాంప్రదాయ బద్దంగా ఈ పేరుని పాపకి ఫిక్స్ చేశారు. ఎంతో పవిత్రమైన, శక్తివంతమైన అమ్మవారి లలితా సహస్రనామ స్తోత్రం నుంచి ఈ పేరు తీసుకున్నారట. క్లిన్ కారా అంటే ప్రకృతి మరో రూపం అని అర్థం వస్తుంది. 

Scroll to load tweet…

మహాశక్తి స్వరూపిణి శక్తి పాపకి అందేలా ఈ నామకరణం చేసి ఉంగరం కూడా తొడిగినట్లు చిరు ప్రకటించారు. అంతటి శక్తితో పాప ఎదుగుతుందని చిరు అన్నారు. చిరంజీవి ట్వీట్ కి మెగా అభిమానులు స్పందిస్తున్నారు. పాప పేరు చాలా బావుంది అని అంటున్నారు. 

View post on Instagram

అలాగే పాపని ఊయలలో ఉంచి మెగా ఫ్యామిలీ మొత్తం మురిసిపోతున్నారు. ఉపాసన సోషల్ మీడియాలో ఆ ఫోటోలని కూడా షేర్ చేసింది. ఉపాసన తల్లిందండ్రులు .. చిరంజీవి సురేఖ దంపతులు.. చరణ్ ఉపాసన సాంప్రదాయ వస్త్రధారణలో మెరిసిపోతూ కనిపిస్తున్నారు.