గౌరవ  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ని ప్రముఖ నటులు చిరంజీవి, నాగార్జున కలిశారు. తెలంగాణా ప్రగతి భవన్‌లో వీరిద్దరూ సీఎం కేసీఆర్ తో  సమావేశం అయ్యారు. గ్రీన్ ఇండియా ప్రోగ్రాం ని బాగా పాప్యులర్ చేసిన ఎంపీ సంతోష్‌ కుమార్‌ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. గత నెలలో హైదేరాబాదు లో సంభవించిన వరదల కారణంగా అనేక మంది నిరాశ్రయులు అయ్యారు. ప్రాణ నష్టం, ఆస్థి నష్టం సంభవించింది. ఆ సమయంలో  వరద బాధితులను ఆదుకునేందుకు సినీ ప్రముఖులు ముందుకు వచ్చి  విరాళాలకు ప్రకటించడం జరిగింది. ఆ విరాళాలకు సంబంధించిన  చెక్కులను సీఎం కేసీఆర్‌కు అందజేశారు. 

వరద భాధితులను ఆదుకునేందుకు టాలీవుడ్‌ ప్రముఖులంతా ముందుకు వచ్చారు. తెలంగాణలో వరద నష్టానికి సాయంగా చిరంజీవి రూ. కోటి, నాగార్జున రూ.50 లక్షలను ప్రకటించారు.  ప్రకటించిన అమౌంట్ కి సంబంధించిన చెక్కులను చిరంజీవి, నాగార్జున కేసీఆర్ కి స్వయంగా అందజేశారు.  సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు, ప్రభాస్ చెరో కోటి రూపాయల విరాళం ప్రకటించగా, ఎన్టీఆర్ 50లక్షలు సాయం చేయడం జరిగింది. ‌ 

హైదరాబాద్ నగర శివార్లలో అంతర్జాతీయ స్థాయిలో సినిమా సిటీ నిర్మిస్తామని, ఇందుకోసం 1500-2000 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. సినీ ప్రముఖులు, అధికారుల బృందం బల్గేరియా వెల్లి అక్కడి సినిమా సిటీని పరిశీలించి రావాలని, సినిమా సిటీ ఆఫ్ హైదరాబాద్ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని సిఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. అన్ లాక్ ప్రక్రియ ప్రారంభమయినందున సినిమా షూటింగులు, సినిమా థియేటర్లు పునఃప్రారంభించవచ్చని సిఎం ప్రకటించారు.
సినీ రంగ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున శనివారం ప్రగతి భవన్ లో సిఎం ను కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణలో సినిమా పరిశ్రమ అభివృద్ధి- విస్తరణపై చర్చ జరిగింది. ఆర్ అండ్ బి శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్, రాజ్యసభ సభ్యుడు జె.సంతోష్ కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ముఖ్య కార్యదర్శులు నర్సింగ్ రావు, రామకృష్ణ రావు, శేషాద్రి తదితరులు పాల్గొన్నారు.

ఇక కులు మనాలి నుండి వైల్డ్ డాగ్ షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకొని నాగార్జున రావడం జరిగింది. ఇక నేడు ప్రసారం కానున్న బిగ్ బాస్ షోలో నాగార్జున సందడి చేయనున్నాడు. మరో వైపు నవంబర్ 9నుండి ఆచార్య షూటింగ్ మొదలుకానుండగా చిరంజీవి సైతం షూటింగ్ సిద్ధం అవుతున్నారు.