ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ `ఆహా` లో సమంత హోస్ట్ గా `సామ్‌జామ్‌` టాక్‌ షో నిర్వహిస్తున్నారు. ఇది ఈ నెల 13న ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఈ టాక్‌ షో విశేషాలను పంచుకున్నారు సమంత. మరోవైపు `ఆహా` నిర్వహకుల్లో ఒకరైన అల్లు అరవింద్‌ సైతం పలు ఆసక్తికర విషయాలను తెలిపారు. అయితే ఇందులో టాలీవుడ్‌ టాప్‌ సెలబ్రిటీలు పాల్గొనబోతుండటం ఆసక్తిని రేకెత్తిస్తుంది. 

ఫస్ట్ టైమ్‌ సమంత వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న ఈ టాక్‌ షోలో మెగాస్టార్‌ పాల్గొనబోతుండటం విశేషం. మెగాస్టార్‌తోపాటు స్టయిలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, క్రేజీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ, స్టార్‌ హీరోయిన్లు తమన్నా, రష్మిక మందన్నా, క్రీడాకారులు సైనా నెహ్వాల్‌, కశ్యప్‌ వంటి వారు కూడా ఈ టాక్‌ షోలో పాల్గొనబోతున్నట్టు అల్లు అరవింద్‌, నందిని రెడ్డి తెలిపారు. 

అయితే ఈ షో డిజైన్‌ కోసం `కౌన్‌ బనేగా కరోడ్‌పతి`, `కాఫీ విత్‌ కరణ్‌` వంటి వాటిని డిజైన్‌ చేసిన టాప్‌ టీమ్‌ పనిచేసిందట. సమంత ఆలోచనలను, సమాజాన్ని ప్రతిబింబించేలా దీన్ని డిజైన్‌ చేసినట్టు తెలిపారు. దక్షిణాదిలోనే ఇలాంటి షో చూడలేదనే విధంగా ఈ షో ఉంటుందని అల్లు అరవింద్‌ తెలిపారు.