నాగ్ నటించిన కొత్త చిత్రం మన్మధుడు 2 ఈ రోజు రిలీజైంది. ఈ సినిమాకు మార్నింగ్ షో నుంచే నెగిటివ్ టాక్ వచ్చింది.  అయితే సినిమాలు, హిట్ అవటం, ప్లాఫ్ అవటం అనేది ఈ ఫీల్డ్ లో సహజం కాబట్టి ఎవరూ సీరియస్ గా తీసుకోరు. కానీ సోషల్ మీడియా జనం మాత్రం ఈ సినిమాలో ఓ సీన్ ని టార్గెట్ చేస్తూ రకుల్ ని, చిన్మయి ని ట్రోల్ చేస్తూ పోస్ట్ లు పెడుతున్నారు. 
 
ఇంతకీ ఆ సీన్ ఏమిటంటే... రకుల్ ప్రీతి సింగ్ ..ఓ సన్నివేశంలో యాంకర్ ఝాన్సిని ముద్దు పెట్టుకుంటుంది. అదీ మామూలుగా కాదు లిప్ టు లిప్. అయితే కథలో భాగంగా అదేమీ పెద్ద ఇష్యూగా అనిపించదు. కానీ విడిగా చూస్తే వల్గర్ గా అనిపిస్తుంది. ఇప్పుడు ఆ వీడియోని, ఆ ఫొటోని తీసి కొందరు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు.  ఓ ఆర్టిస్ట్ మరో ఆర్టిస్ట్ ని సన్నివేశపరంగా ముద్దెట్టుకుంటే తప్పేమిటి అదేమన్నా పెద్ద క్రైమా అని కొందరు అడుగుతున్నారు. రకుల్ ని సపోర్ట్ చేస్తున్నారు. మరి కొందరు మాత్రం ఎంత కథలో భాగమైతే మాత్రం ఫ్యామిలీలతో కలిసి వెళ్లే సినిమాకు ఇలాంటి వల్గర్ సీన్స్ పెడితే ఎంత ఇబ్బందిగా అనిపిస్తుంది అంటున్నారు. 
 
అక్కడితో ఆగితే ఫర్వాలేదు. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ భార్య చిన్మయి సైతం ఈ విషయంలో ట్రోలింగ్ కు గురి అవుతోంది. ఆమెకు సంభందం లేకపోయినా మీ భర్త ఇలాంటి సినిమా చేస్తూంటే అడ్డుకోలేకపోయావా అని నిలదీస్తున్నారు. అక్కడితో ఆగకుండా మీ మామగారు ఇలాంటి బి గ్రేడ్ సినిమా తీస్తూంటే నువ్వు ఆపలేదేం అని సమంతని అడుగుతున్నారు.  మరి రకుల్, చిన్మయి, సమంత ఈ విషయంలో ఎలా స్పందిస్తారో చూడాలి.