Asianet News TeluguAsianet News Telugu

కరీంనగర్ లో చిరంజీవి, విజయశాంతి ముచ్చట్లు చూశారా.. దిల్ రాజు చేతుల మీదుగా 'షరతులు వర్తిస్తాయి' టీజర్

చైత‌న్య రావు, భూమి శెట్టి జంట‌గా న‌టించిన చిత్రం "ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి". కుమార‌స్వామి(అక్ష‌ర‌) ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని స్టార్ లైట్ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై నాగార్జున సామ‌ల‌, శ్రీష్ కుమార్ గుండా, డాక్ట‌ర్ కృష్ణ‌కాంత్ చిత్త‌జ‌ల్లు నిర్మించారు. 

Chiatanya rao sharathulu varthisthai teaser out now dtr
Author
First Published Feb 3, 2024, 8:57 PM IST | Last Updated Feb 3, 2024, 8:57 PM IST

చైత‌న్య రావు, భూమి శెట్టి జంట‌గా న‌టించిన చిత్రం "ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి". కుమార‌స్వామి(అక్ష‌ర‌) ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని స్టార్ లైట్ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై నాగార్జున సామ‌ల‌, శ్రీష్ కుమార్ గుండా, డాక్ట‌ర్ కృష్ణ‌కాంత్ చిత్త‌జ‌ల్లు నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న "షరతులు వర్తిస్తాయి" సినిమా త్వరలో థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇవాళ ఈ సినిమా టీజర్ విడుదల కార్యక్రమాన్ని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ముఖ్య అతిథిగా హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు వేణు ఊడుగుల, మామిడి హరికృష్ణ అతిథులుగా పాల్గొన్నారు.

30 వెడ్స్ 21 తో అలరించిన చైతన్య రావు 'షరతులు వర్తిస్తాయి అనే చిత్రంలో కూడా అదే స్థాయిలో వినోదం అందించినట్లు ఉన్నారు. షరతులు వర్తిస్తాయి టీజర్ దిల్ రాజు చేతుల మీదుగా లాంచ్ అయింది. చైతన్య రావు పాత్ర పేరు చిరంజీవి.. భూమి శెట్టి పాత్ర పేరు విజయశాంతి.. వీరిద్దరి కరీంనగర్ ముచ్చట్లు భలే ఉన్నాయి. 

ప్రొడ్యూసర్ దిల్ రాజు మాట్లాడుతూ - మామిడి హరికృష్ణ గారితో నాకు బలగం సినిమా చేసిన టైమ్ లో పరిచయం ఏర్పడింది. ఒకసారి రవీంద్రభారతికి తీసుకెళ్లి వాళ్లు చేసే ట్రైనింగ్ కార్యక్రమాలు చూపించారు. సినిమా ఇండస్ట్రీలోకి రావాలనుకునే ఔత్సాహికులకు వాళ్లు కల్చరల్ డిపార్ట్ మెంట్ ద్వారా ఇస్తున్న ట్రైనింగ్, ఇతర కార్యక్రమాల గురించి తెలిసి హ్యాపీగా ఫీలయ్యా. మేము మా దగ్గరకు వచ్చే రైటర్స్, డైరెక్టర్స్ కు అవకాశాలు ఇస్తుంటాం. అయితే వీళ్లు మంచి ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమాలు చేపట్టారు. ఒక మంచి కాన్సెప్ట్ తీసుకుని "ష‌ర‌తులు వ‌ర్తిసాయి" సినిమాను రూపొందించారు. సాంగ్, టీజర్ చూశాను. బాగున్నాయి. బలగం కంటే ఎక్కువగా  తెలంగాణ నేటివ్ తో తెరకెక్కించారు. ఇదొక మంచి సినిమా అవుతుందని ఆశిస్తున్నా. మూవీ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అన్నారు.

మామిడి హరికృష్ణ మాట్లాడుతూ - "ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి" టీజర్ లాంఛ్ కు వచ్చిన దిల్ రాజు గారికి థ్యాంక్స్. మనం సాధించిన దాని నుంచి సమాజానికి తిరిగి ఏదైనా ఇవ్వాలని కోరుకునే మంచి వ్యక్తులు నాగార్జున సామల, శ్రీష్ కుమార్ గార్లు. వాళ్లు తమ ఫ్రెండ్ డా.కృష్ణకాంత్ చిత్తజల్లు గారితో కలిసి నిర్మించిన సినిమా ఇది. ఈ ముగ్గురు లేకుంటే ఈ సినిమా ఉండేది కాదు. సహజమైన కథా కథనాలతో కొంత సినిమాటిక్ లిబర్టీ తీసుకుని ప్రేక్షకులకు నచ్చే అన్ని అంశాలతో రూపొందిన సినిమా ఇది. దర్శకుడు కుమారస్వామి మంచి రైటర్. అతను సినిమా  చేయాలనే కలతో గోదావరి ఖని ప్రాంతం నుంచి వచ్చాను. ఇవాళ ఆ కల నెరవేర్చుకున్నాడు. పాత్రల్లో జీవించే అతి కొద్ది మంది నటుల్లో చైతన్య రావ్ ఒకరు. ఆయన 30 వెడ్స్ 21 నుంచి కీడా కోలా వరకు డిఫరెంట్ కాన్సెప్ట్స్ చేస్తూ నటుడిగా పేరు తెచ్చుకుంటున్నాడు. అలాగే హీరోయిన్ భూమి శెట్టికి కూడా ఈ సినిమాతో మంచి గుర్తింపు దక్కుతుంది. అన్నారు.

దర్శకుడు కుమారస్వామి మాట్లాడుతూ - మా "ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి" సినిమా ఫస్ట్ లుక్ లాంఛ్ చేసిన త్రివిక్రమ్ గారికి,  సాంగ్ రిలీజ్ చేసిన శేఖర్ కమ్ముల గారికి, ఇప్పుడు టీజర్ విడుదల చేసిన దిల్ రాజు గారికి, మాకు సపోర్ట్ చేస్తున్న మధుర శ్రీధర్ గారికి  థ్యాంక్స్. ప్రేక్షకులకు చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా ఉండదు. మంచి సినిమా అయితే తప్పకుండా చూస్తారు. మా సినిమాలో కంటెంట్ ఉంది. ప్రేక్షకుల ఆదరణ దక్కుతుందని ఆశిస్తున్నాను. ఈ మూవీ చేసే క్రమంలో హీరో చైతన్య, హీరోయిన్ భూమి ఎంతో సపోర్ట్ ఇచ్చారు అన్నారు.

హీరో చైతన్య రావ్ మాట్లాడుతూ -  ఒక మంచి చిన్న సినిమా థియేటర్స్ దాకా రావడం కష్టంగా ఉంటోంది. అయితే త్రివిక్రమ్, శేఖర్ కమ్ముల, దిల్ రాజు, వేణు ఊడుగుల వంటి మంచి పర్సన్స్ ద్వారా మాకు సపోర్ట్ లభిస్తోంది. నేను కరీంనగర్ వాసిని. పరిశ్రమలో నటుడిగా ఎదిగి మళ్లీ కరీంనగర్ వెళ్లి సినిమా షూటింగ్ చేయడం ఒక అఛీవ్ మెంట్ లా అనిపించింది. "ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి" సినిమాతో డైరెక్టర్ కుమారస్వామి తనదైన ముద్ర వేసుకుంటారు. ఒకు సున్నితమైన కథకు కమర్షియల్ ఎలిమెంట్స్ చేర్చుతూ అందరికీ నచ్చేలా సినిమా రూపొందించడం ఈజీ కాదు . ఈ సినిమా తర్వాత కుమారస్వామి మరిన్ని మంచి మూవీస్ చేస్తాడు. త్వరలోనే "ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి" సినిమా థియేటర్స్ లోకి వస్తుంది. మీరంతా ఆదరించాలని కోరుకుంటున్నా. అన్నారు.

నటీనటులు - చైతన్య రావ్, భూమి శెట్టి, నంద కిషోర్, సంతోష్ యాదవ్, దేవరాజ్ పాలమూరు, పద్మావతి, వెంకీ మంకీ, శివ కల్యాణ్, మల్లేష్ బలాస్త్, సీతా మహాలక్ష్మి, పెద్దింటి అశోక్ కుమార్, సుజాత తదితరులు

టెక్నికల్ టీమ్

ఆర్ట్ డైరెక్టర్ - గాంధీ నడికుడికర్
ఎడిటింగ్ - సీహెచ్ వంశీ కృష్ణ, గజ్జల రక్షిత్ కుమార్
సినిమాటోగ్రఫీ - ప్రవీణ్ వనమాలి, శేఖర్ పోచంపల్లి
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ - ప్రిన్స్ హెన్రీ
మ్యూజిక్ - అరుణ్ చిలువేరు, సరేష్ బొబ్బిలి (పన్నెండు గుంజల)
డైలాగ్స్ - పెద్దింటి అశోక్ కుమార్
పీఆర్ ఓ - జీఎస్ కే మీడియా
బ్యానర్ - స్టార్ లైట్ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్
ప్రొడ్యూసర్స్ - శ్రీలత, నాగార్జున సామల, శారద, శ్రీష్ కుమార్ గుండా, విజయ, డా.కృష్ణకాంత్ చిత్తజల్లు
రచన దర్శకత్వం - కుమారస్వామి (అక్షర)

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios