Asianet News TeluguAsianet News Telugu

నోటికొచ్చినట్లు వాగి అరెస్ట్ అయిన నటి

ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు నటిని అరెస్ట్‌ చేశారు పోలీసులు. ఈ నేపథ్యంలో చెన్నై పోలీసులు మీరా మీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసి.. అరెస్ట్‌ చేశారు.

Chennai police arrests Tamil actor Meera Mithun
Author
Chennai, First Published Aug 10, 2021, 9:42 AM IST

 దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తమిళ నటి మీరా మిథున్‌ని చెన్నై పోలీసులు అరెస్ట్‌ చేశారు. మీరా కామెంట్స్ వీడియో కాస్త సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో నెటిజనులు మీరా మిథున్‌సై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీరా కామెంట్స్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు దళిత-కేంద్రీకృత పార్టీ అయిన విదుతలై సిరుతైగల్ కట్చి నాయకుడు వన్నీ అరసు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు నటిని అరెస్ట్‌ చేశారు పోలీసులు.  ఈ నేపథ్యంలో చెన్నై పోలీసులు మీరా మీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసి.. అరెస్ట్‌ చేశారు.  

పూర్తి వివరాల్లోకి వెళితే..బిగ్‏బాస్ తమిళ సీజన్ 3 కంటెస్టెంట్ మీరా మిథున్ పై చెన్నై పోలీస్ స్టేషన్‏లో కేసు నమోదైంది. తమ సామాజిక వర్గం వారిని అలాగే సామాజిక సేవ చేసే కార్యకర్తలపై మీరా మిథున్ అనుచిత వ్యాఖ్యలు చేసింది బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాల నాయకులు ఆమెపై ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని.. ఇప్పటికైనా మీరా పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాల్సిందే అంటూ పలువురు డిమాండ్ చేసారు.

రీసెంట్ గా ఓ యూట్యూబ్ ఛానల్‏కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మీరా షెడ్యూల్డ్ కుల చిత్ర కార్మికులందరినీ ఇండస్ట్రీ నుంచి బయటకు పంపించాలని మీరా మిథున్ అన్నారు. ఎస్సీ కమ్యూనిటీ సభ్యులు చట్ట విరుద్ధమైన కార్యకలపాలు, నేరాలకు పాల్పడటం వలన ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కారణం లేకుండా ఎవరు కూడా ఒకరి గురించి చెడుగా మాట్లాడరు అంటూ చెప్పుకొచ్చింది. చిత్రపరిశ్రమలోని షెడ్యూల్డ్ కులాల వారందరినీ, పరిశ్రమలోని డైరెక్టర్లను బయటకు పంపించే సమయం వచ్చిందనుకుంటున్నాను అని అన్నారు. గతంలో ఎస్సీ కమ్యూనిటీకి చెందిన దర్శకుడు.. తన సినిమా ఫస్ట్‏లుక్ కోసం తన సినిమా కోసం ఉపయోగించుకున్నాడని మీరా ఆరోపించింది.

మీరా ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. దీంతో పలు కుల సంఘాల నేతలు.. తమ సామాజిక వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మీరాను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసారు. అలాగే తమ అభిమాన హీరోహీరోయిన్స్‏ను అవమానించేలా మాట్లాడిందని కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎట్టకేలకు పోలీసులు స్పందించారు. ఆమెపై ఇప్పటికే 7 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని.. సైబర్ క్రైమ్ డిపార్ట్‏మెంట్ ఆధ్వర్యంలో ఈ కేసులు విచారణ జరుగుతున్నాయని తెలిపారు.

మీరా మిథున్‌ షేర్‌ చేసిన వీడియోలో.. ఆమె ఓ డైరెక్టర్‌ అనుమతి లేకుండా తన ఫోటోని అతడి మూవీ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ కోసం వాడుకున్నాడని ఆరోపించారు. అంతటితో ఊరుకోక.. ‘‘తక్కువ జాతి అనగా దళిత సామాజిక వర్గానికి చెందిన వారి ఆలోచనలు ఇలానే ఉంటాయి. చాలా చీప్‌గా ప్రవర్తిస్తారు’’ అంటూ నోటికొచ్చినట్లు విమర్శించారు. దళితులు నేరాలకు, అంసాఘిక కార్యకలపాలకు పాల్పడటం వల్లనే వారిని సమాజంలో నీచంగా చూస్తున్నారని వ్యాఖ్యానించారు. అంతేకాక తమిళ ఇండస్ట్రీలో ఉన్న దళిత దర్శకులను, నటీనటులను బయటకు గెంటేయాలని సూచించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios