చెన్నై వరదలకు సూపర్ స్టార్ రజనీకాంత్ ఇళ్లు నీటమునిగింది. దీంతో వారి కుటుంబ సభ్యులకు రక్షణ చర్యలు అందుతున్నాయి. ప్రస్తుతం రజనీ ఎక్కడున్నారు.. కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటనే విషయానికొస్తే...  

మిచాంగ్ తుఫాన్ (Michaung Cyclone) తమిళనాడు రాష్ట్ర ప్రజలను అతాలకుతం చేస్తున్న విషయం తెలిసిందే. వారం రోజులుగా ఇంకా తీవ్రత తగ్గలేదు. వరదలు ఇళ్లలోకి చేరుకోవడం జనాలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం వెన్వెంటనే సహాయకచర్యలను, రక్షణ చర్యలను ముమ్మరంగా కొనసాగిస్తోంది. ప్రమాదంలో ఉన్న వారిని రిస్క్యూ టీమ్ వెళ్లి కాపాడుతోంది. చెన్నైలోని ప్రజలనే కాకుండా.. కోలీవుడ్ ప్రముఖులు నివసించే ప్రాంతాలతో సహా విస్తృతమైన విధ్వంసానికి గురిచేసింది. 

ఈ క్రమంలో సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) ఇంటి చుట్టు భారీగా నీళ్లు చేరాయి. పోయెస్‌ గార్డెన్‌లోని సూపర్‌స్టార్‌ ఇల్లు వరదల్లో చిక్కుకుంది. కానీ ఇంట్లోకి వరద నీరు చేరలేదు. ప్రస్తుతం ఆయన ఇంటి చుట్టు ప్రవహిస్తున్న వరద నీటికి సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. అయితే సూపర్ స్టార్ కుటుంబాన్ని అక్కడి నుంచి సురక్షితమై ప్రాంతాలకు తరలించారు. ప్రస్తుతం ఫొటో, వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

కాగా, ప్రస్తుతం రజనీకాంత్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే. తలైవర్ 170 వర్క్ టైటిల్ తో షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. దీంతో రజనీ ప్రస్తుతం తిరునల్వేలిలో షూటింగ్ లో ఉన్నారు. అతని కుటుంబం మాత్రమే చెన్నైలో ఉంది. వరద తీవ్రత పెరగడంతో అక్కడి నుంచి మరోచోటుకి ఇంటి సభ్యులను మార్చేశారు.

ఇటీవల బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్ అమీర్ ఖాన్ (Aamir Khan) కూడా చెన్నై వరదల్లో బాధితుడిగా నిలిచాడు. ఏ కారణం చేత తమిళనాడుకు వెళ్లారో కానీ.. తమిళ నటుడు విష్ణు విశాల్ కుటుంబంతో కనిపించారు. విష్ణు విశాల్ ఇల్లు మొత్తం జలదిగ్భందం కావడంతో సాయం కోసం ప్రభుత్వాన్ని కోరారు. స్పందించిన సిబ్బంది ఆయన్ని, కుటుంబ సభ్యులను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఆ సమయంలో అమీర్ ఖాన్ అక్కడ ఉండటం ఆసక్తికరంగా మారింది.

Scroll to load tweet…