హీరోయిన్ గా పలు సినిమాలు చేసిన ఛార్మికి ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గడంతో దర్శకుడు పూరి చెంతకు చేరింది. ఆ కాంపౌండ్ లోనే ఉంటూ సినిమాలకు సంబంధించిన వ్యవహారాలు చూసుకుంటూ వచ్చింది. 

హీరోయిన్ గా పలు సినిమాలు చేసిన ఛార్మికి ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గడంతో దర్శకుడు పూరి చెంతకు చేరింది. ఆ కాంపౌండ్ లోనే ఉంటూ సినిమాలకు సంబంధించిన వ్యవహారాలు చూసుకుంటూ వచ్చింది. పూరి తెరకెక్కించిన 'మెహబూబా' సినిమాకి సహ నిర్మాతగా వ్యవహరించి ఫ్లాప్ మూటగట్టుకుంది.

ఈ సినిమాతో ఆమె నష్టాలను చవిచూడక తప్పలేదు. ఇక ఇప్పుడు పూరి తెరకేక్కిస్తోన్న 'ఇస్మార్ట్ శంకర్' సినిమా నిర్మాణ బాధ్యతల్లో కూడా పాలు పంచుకుంటోంది. అంతేకాదు పూరి జగన్నాథ్ బ్యానర్ లో ఆకాష్ పూరి హీరోగా చేయనున్న సినిమాకు కూడా ఛార్మి సహ నిర్మాతగా వ్యవహరించనుంది.

ఇదంతా చూస్తుంటే ఇప్పట్లో ఛార్మి ఈ కాంపౌండ్ ని వదిలేలా కనిపించడం లేదు. పూరి కూడా నిర్మాణానికి సంబంధించిన అన్ని హక్కులకు ఛార్మికి అప్పగించినట్లు తెలుస్తోంది. దర్శకత్వం, నిర్మాణం రెండూ ఒకేసారి చూసుకోవడం కష్టమవుతుంది కాబట్టి పూరి.. ఛార్మికి బాధ్యతలు మొత్తం అప్పగించేశాడు.

గతంలో డబ్బు విషయంలో కొందరు పూరిని మోసగించారు. అందుకే బయటవాళ్లను నమ్మకుండా.. ఛార్మిని నమ్ముకున్నాడు. ఛార్మి నిర్మాణ వ్యవహారాలతో పాటు నటీనటుల కాల్షీట్స్ తీసుకోవడం, ప్రాజెక్ట్ లు సెట్ చేయడం వంటివి కూడా చేస్తోందని సమాచారం.