టాలీవుడ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ నెక్స్ట్ ఇస్మార్ట్ శంకర్ సినిమా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. వరుస అపజయాలతో సతమతమవుతున్న పూరికి ఈ సినిమా హిట్టవ్వడం చాలా అవసరం. గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక కొత్త తరహాలో ఇస్మార్ట్ శంకర్ ను డైరెక్ట్ చేశాడు. 

ఇక పూరి కనెక్ట్స ప్రొడక్షన్ లో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ కు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఛార్మి సైతం సినిమా హిట్టవ్వాలని చాలా ఆశలు పెట్టుకుంది. అయితే సినిమాకు సంబందించిన ప్రమోషన్స్ లోనే ఈ ఇద్దరు ఒక కొత్త ఫార్మాట్ బిజినెస్ ని మొదలెట్టారు. బీఇస్మార్ట్ అనే పేరుతో బట్టల వ్యాపారాన్ని మొదలుపెట్టనున్నారు. 

ఛార్మి ఈ విషయాన్నీ సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ఓ వెబ్ సైట్ స్టార్ట్ చేసి ఈ బ్రాండ్ ను ప్రమోట్ చేయాలనీ అనుకుంటున్నారు. మొదట ఆర్డర్ చేసినవారికి 30% డిస్కౌంట్ కూడా లభిస్తుందని అన్నారు. ఇక ఇస్మార్ట్ శంకర్ సినిమా వరల్డ్ వైడ్ గా ఈ నెల 18న రిలీజ్ కాబోతోంది. రామ్ కి జోడిగా నిధి అగర్వాల్ - నాభ నటేష్ నటించగా మణిశర్మ సంగీతం అందించాడు.