రజనీకాంత్‌తో `చంద్రముఖి 3`.. క్రేజీ అప్‌డేట్ ఇచ్చిన డైరెక్టర్.. అసలు కథ ఇదే!
రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ నటిస్తున్న `చంద్రముఖి 2` సినిమా విడుదల కూడా కాలేదు.. అప్పుడే మూడో సీక్వెల్‌పై క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు పి. వాసు.
`చంద్రముఖి` సినిమా హార్రర్ కామెడీ చిత్రాల్లో ఓ ట్రెండ్ సెట్టర్. ఆ తర్వాతనే హర్రర్ కామెడీ చిత్రాల జోరు ఊపందుకుంది. `చంద్రముఖి` చిత్రంలో రజనీ మేనరిజం, జ్యోతిక నట విశ్వరూపం సినిమాని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చేసింది. తాజాగా ఈ సినిమాకి సీక్వెల్ రూపొందుతుంది. `చంద్రముఖి2` పేరుతోనే రూపొందిస్తున్నారు. రజనీ స్థానంలో రాఘవ లారెన్స్, చంద్రముఖిగా కంగనా రనౌత్ నటిస్తున్నారు. సెప్టెంబర్ 28న సినిమా విడుదల కాబోతుంది.
ఇంకా సినిమా విడుదల కూడా కాలేదు.. అప్పుడే మూడో సీక్వెల్‌పై క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు పి. వాసు. `చంద్రముఖి 3` కూడా ఉంటుందని తెలిపారు. `చంద్రముఖి 2` చివర్లో ఆ విషయాన్ని చూపించామని, వడివేలు పాత్రతో ఆ ట్విస్ట్ చూపించినట్టు తెలిపారు. చివర్లో `వామ్మో మళ్లీ వచ్చిందా` అంటూ ఆయన చెప్పే డైలాగ్ తో సీక్వెల్‌పై హింట్ ఇచ్చినట్టు దర్శకుడు పి. వాసు చెప్పారు. అయితే ఇందులో రజనీకాంత్ నటించే అవకాశం ఉందా? అనే ప్రశ్నకి స్పందిస్తూ, రజనీ సార్ `ఇందులో మీరు కావాలంటే` ఆయన చేయడానికి సిద్ధంగానే ఉంటారు. ఆ కథకి తగ్గట్టుగా ప్లాన్ చేస్తామని చెప్పారు. ఈ సినిమా రిజల్ట్ ని బట్టి అది ఉంటుందన్నారు.
ఈ సందర్భంగా `చంద్రముఖి2` సినిమాని వాయిదా వేయడంపై దర్శకుడు వాసు మాట్లాడుతూ, సినిమాని డీఐ వర్క్ కి పంపించామని, ఆసమయంలో దాదాపు 400 షాట్స్ కనిపించడం లేదని టెక్నికల్ టీమ్ చెప్పారు. దీంతో అంతా షాక్ అయ్యాం. దాన్ని వెతకడం పెద్ద ప్రాసెస్. అదే సమయంలో అన్ని షాట్స్ మిస్ కావడమనేది పెద్ద టెన్షన్ పెట్టింది. దీంతో చేసేదేం లేక వాయిదా వేశామని తెలిపారు.
ఇక `చంద్రముఖి 2`లోకి తాను కంగనా ఎలా వచ్చారనే దానిపై హీరో లారెన్స్ స్పందిస్తూ, పి వాసు ఓ ఇంటర్వ్యూలో `చంద్రముఖి2` చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో వెంటనే ఆయనకు ఫోన్ చేసి అభినందనలు తెలిపాను. హీరో ప్రస్తావన వచ్చినప్పుడు రజనీ సార్ చేయడం లేదన్నారు. ఇతర హీరోలతో చేయాలనుకుంటున్నట్టు తెలిపారు. దీంతో నాకు కథెప్పుడు చెబుతున్నారని అడగ్గా, ఆ వెంటనే కథ చెప్పడం, నచ్చడం జరిగిపోయాయి` అన్నారు. ఆ తర్వాత కంగనా రనౌత్ కూడా తనే అడిగి ఈ పాత్ర చేసినట్టు తెలిపింది.
`చంద్రముఖి2` కథ ఏంటో బయటపెట్టాడు దర్శకుడు పి వాసు. `చంద్రముఖి`కి దీనికి చిన్న లింక్ ఉంటుందని, ఆ లింక్ ఆధారంగా ఈ సినిమా సాగుతుందని తెలిపారు. మాతృకలో ఉన్న జ్యోతిక పాత్ర వేరు, ఇందులో చంద్రముఖి వేరన్నారు. అందులో జ్యోతికలోకి చంద్రముఖి ఆవహిస్తుందని, కానీ సీక్వెల్‌లో చంద్రముఖినే వస్తుందన్నారు. అలాగే మొదటి పార్ట్ లో రాజా గా రజనీకాంత్ కనిపిస్తారు. ఇందులో రియల్ రాజానే ఉంటాడని, అది రాఘవ చేస్తున్నట్టు తెలిపారు.
రజనీకాంత్ చేసిన పాత్రని మరొకరు చేస్తున్నారంటే ఆ ప్రభావం కచ్చితంగా ఉంటుంది. అందుకే కొత్తగా చేసే ప్రయత్నం చేశామని, రజనీ మేనరిజాన్ని రాకుండా కష్టపడ్డామని తెలిపారు రాఘవ లారెన్స్. ఈ విషయంలో తాను మొదట్లో కొంత టెన్షన్‌కి కూడా గురైనట్టు వెల్లడించారు. సినిమాలో తాను ఇన్‌వాల్వ్ కాలేదని, పూర్తి క్రెడిట్ దర్శకుడిదే అని వెల్లడించారు రాఘవ లారెన్స్. సినిమా కచ్చితంగా అందరిని అలరిస్తుందన్నారు.