Chandramohan : ఇద్దరు కూతుళ్లే.. చంద్రమోహన్ కు అంతిమ సంస్కారాలు చేసింది ఎవరంటే?

చంద్రమోహన్ అంత్యక్రియలు ముగిశాయి. రెండు రోజుల ఆలస్యంగా జరిగాయి. ఆయనకు ఇద్దరు కూతుళ్లే కావడంతో అంతిమ సంస్కారాలను చేసేందుకు ఎవరు ముందుకు వస్తారనేది ఆసక్తికరంగా మారింది. 
 

Chandramohans last rites are completed NSK

తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్రవేసుకున్న చంద్రమోహన్ (Chandra Mohan) మూడు రోజుల కింద కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మరణంతో ఇండస్ట్రీలోని ప్రముఖులు, సెలెబ్రెటీలు దిగ్భ్రాంతికి గురవుతున్నారు. సోషల్ మీడియా వేదికగా, చివరి చూపుతోను ఆయనకు నివాళి అర్పించారు. కాగా, ఆయన అంత్యక్రియులు రెండు రోజుల తర్వాత నిన్న జరిగాయి. 

అయితే చంద్రమోహన్ కు భార్య జలంధర. ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కూతురు మధుర మీనాక్షి, చిన్న కూతురు మాధవి.  పెద్దమ్మాయి అమెరికాలో సెటిల్ అవ్వడంతో సమయానికి రాలేకపోయింది. చివరి చూపు చూసేందుకు అంత్యక్రియలను కాస్తా ఆలస్యంగా జరిపారు.  అప్పటి వరకు పార్థివ దేహాన్ని వాళ్ల ఇంట్లోనే ఉంచారు. తండ్రి మరణంతో కూతుళ్లు ఇద్దరు శోకసంద్రంలో మునిగిపోయారు. 

కాగా, చంద్రమోహన్ కు ఇద్దరు కూతుళ్లే కావడంతో అంతిమ సంస్కారాలు ఎవరు చేస్తారని అందరూ ఎదురుచూశారు. చంద్రమోహన్ సోదరుడు మల్లంపల్లి దుర్గా ప్రసాద్ అంతిమ సంస్కారాలు చేశారు. పంజాగుట్ట స్మశాన వాటికలో అంత్యక్రియలను దగ్గరుండి పూర్తి చేశారు. చంద్రమోహన్  అంతిమయాత్రలో అభిమానులు, పలువురు సెలబ్రెటీలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 

ఇక చంద్రమోహన్ 1943 మే 23న ఆయన మద్రాస్ లో జన్మించారు. ఆయన పూర్తిపేరు మల్లంపల్లి చంద్రశేఖర్ రావు. వెండితెరపేరు చంద్రమోహన్. తెలుగు చిత్రపరిశ్రమలో 900కు పైగా సినిమాల్లో నటించారు. హీరోగా, విభిన్నమైన పాత్రలతోనూ అలరించారు. అనారోగ్యం కారణంగా కొంత కాలంగా ఆయన సినిమాలకు దూరంగా ఉన్నారు. ఆరోగ్యం క్షీణించడంతో 80వ ఏటా కన్నుమూశారు. 

Chandramohans last rites are completed NSK

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios