పాప్ సింగర్ స్మితకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చారు. గాయనిగా, నటిగా ఆమె మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. స్మిత చేసే మ్యూజిక్ ఆల్బమ్స్ కు యువతలో మంచి క్రేజ్ ఉంది. గమ్మతైన గాత్రంతో ఆమె చాలా కాలంగా శ్రోతలని అలరిస్తున్నారు. 

గాయనిగా స్మిత 20 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆమెని అభినందిస్తూ లేఖ పంపారు. ఆ లేఖని స్మిత సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇది చాలా సంతోషకరమైన సర్ ప్రైజ్. చంద్రబాబు గారికి కృతజ్ఞతలు అని స్మిత ట్వీట్ చేసి ఆ లేఖని షేర్ చేశారు. 

ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఆమెకు అధికారికంగా అభినందన లేఖని పంపారు. గాయని స్మిత తన పాటలతో సంగీత ప్రియులకు అద్భుతంగా ఆహ్లాదాన్ని కలిగిస్తున్నారు. అందుకు ఆమెకు అభినందనలు. స్మిత తెలుగులోనే మొట్ట మొదటి మ్యూజిక్ ఆల్బమ్ రూపొందించడం గర్వకారణం. 

కేవలం తెలుగులోనే కాకుండా స్మిత 9 భాషల్లో పాటలు పాడారు. సంగీతాన్ని ఎల్లలు లేవని నిరూపించారు. భవిష్యత్తులో కూడా స్మిత ఇలాగే సంగీత ప్రియులని అలరించాలని భావిస్తున్నట్లు చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.