ప్రస్తుతం ఎక్కడ చూసినా 'సాహో' మేనియా నడుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ అభిమానులు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుందని సమాచారం. కానీ నిర్మాతలు ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించలేదు.

సినిమా చూసిన సెన్సార్ సభ్యులు ఎలాంటి కట్స్ లేకుండా 'ఏ' సర్టిఫికేట్, చెప్పిన మార్పులు చేసే యు/ఏ సర్టిఫికేట్ ఇస్తామని చెప్పినట్లు టాక్. కట్స్ లేకుండా 'ఏ' సర్టిఫికేట్ గనుక తీసుకుంటే చాలా ఇబ్బందులు ఉంటాయి. 18 ఏళ్లలోపు పిల్లలు అప్పుడు సినిమా చూడడానికి ఉండదు.

ఇది కచ్చితంగా సినిమా కలెక్షన్స్ మీద ప్రభాస్ చూపిస్తుంది. అలా కాకుండా 'యు/ఏ' ఇస్తే ఎలాంటి సమస్య ఉండదు. అందుకే కట్స్ మ్యూట్స్ లేకుండా యు/ఏ వచ్చేలా  ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది.

సినిమా రిలీజ్ కి మరో తొమ్మిది రోజులు మాత్రం గడువు ఉండడంతో ఇదో సమస్యగా మారింది. సెన్సార్ కి సంబంధించిన అప్డేట్ ఈరోజు లేదా రేపటిలో తెలిసే అవకాశం ఉంది. ఇప్పటికే సినిమా నిడివి 2 గంటల 52 నిమిషాలు ఉందనే టాక్ ఉంది. ఫైనల్ కట్ లో ఏమైనా తగ్గించారేమో చూడాలి.  ప్రస్తుతానికైతే అలాంటి సూచనలు కనిపించడం లేదు!