Asianet News TeluguAsianet News Telugu

పోలీస్ కస్టడీలో కొడుకు.. పుట్టినరోజున షారుఖ్ భార్యకు ధైర్యం చెబుతున్న సెలెబ్రిటీలు

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఫ్యామిలీ ప్రస్తుతం మానసిక ఒత్తిడిలో ఉంది. అందుకు కారణం తెలిసిందే. శనివారం రోజు షారుఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

Celebs birth day wishes to Aryan Khan's mother Gauri Khan
Author
Hyderabad, First Published Oct 8, 2021, 1:31 PM IST

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఫ్యామిలీ ప్రస్తుతం మానసిక ఒత్తిడిలో ఉంది. అందుకు కారణం తెలిసిందే. శనివారం రోజు షారుఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. క్రూయిజ్ షిప్ లో రేవ్ పార్టీ నిర్వహిస్తూ స్నేహితులతో కలసి నిషేదిత డ్రగ్స్ వాడుతున్నాడనే ఆరోపణలతో ఎన్సీబీ ఆర్యన్ ఖాన్ ని అదుపులోకి తీసుకుంది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Suhana Khan (@suhanakhan2)

తన కొడుకు బెయిల్ కోసం షారుఖ్ గట్టి ప్రయత్నాల్లో ఉన్నారు. కానీ ముంబై కోర్టు మాత్రం ఆర్యన్ ఖాన్ కి బెయిల్ నిరాకరించింది. 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. దీనితో ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో అని బాలీవుడ్ మొత్తం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. 

ఇదిలా ఉండగా Aryan Khan తల్లి గౌరీ ఖాన్ నేడు తన 51వ జన్మదిన వేడుక జరుపుకుంటున్నారు. తన కొడుకు అరెస్ట్ అయ్యాడనే బాధలో ఆమె ఎలాగు పుట్టినరోజుని సెలెబ్రేట్ చేసుకోరు. కానీ బాలీవుడ్ ప్రముఖులు ఆమెకు ధైర్యం చెప్పే విధంగా బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. గౌరీ ఖాన్ కుమార్తె సుహానా, హృతిక్ రోషన్ మాజీ భార్య సుహాన్నే ఖాన్ , బాలీవుడ్ లేడి డైరెక్టర్ ఫరాన్ ఖాన్ లు ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 

 

సుహానా సింపుల్ గా హ్యాపీ బర్త్ డే మా అంటూ షారుఖ్, గౌరీ ఖాన్ ల రొమాంటిక్ పిక్ పోస్ట్ చేసింది. ఇక ఫరాన్ ఖాన్ గౌరీ ఖాన్ కు బర్త్ డే విషెష్ చెబుతూ.. తల్లికి ఉన్న బలం ఇంకెవరికీ ఉండదు. తల్లి ప్రార్థనలు కొండలని, సముద్రాలని సైతం కదిలిస్తాయి. నీ బలం గత వారం నుంచి గమనిస్తున్నాను. నీకు జన్మదిన శుభాకాంక్షలు అంటూ ఫరాన్ ఖాన్ పోస్ట్ పెట్టింది. 

అలాగే హృతిక్ మాజీ సతీమణి సుహాన్నే కూడాగౌరీ ఖాన్ ని విష్ చేసింది. సుహాన్నే ఖాన్, గౌరీ ఖాన్ ఇద్దరూ మంచి స్నేహితులు. దేవుడి ప్రేమాభిమానాలు నీపై నీ కుటుంబంపై ఎప్పుడూ ఉంటాయి అని సుహాన్నే పోస్ట్ పెట్టింది. 

Also Read: ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు.. మాఫియా పప్పు బ్యాచ్ అంటూ హృతిక్ కి కంగనా కౌంటర్

ఇదిలా ఉండగా ప్రస్తుతం ఆర్యన్ ఖాన్ కేసు విచారణ జరుగుతోంది. గురువారం ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ విచారణకు రాగా.. ఆర్యన్ ఖాన్ ని ఇంకా విచారించాల్సి ఉందని ఎన్సీబీ కోర్టుని కోరింది. దీనితో కోర్టు ఎన్సీబీ తో ఏకీభవిస్తూ ఆర్యన్ ఖాన్ కు బెయిల్ నిరాకరించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios