Asianet News TeluguAsianet News Telugu

ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు.. మాఫియా పప్పు బ్యాచ్ అంటూ హృతిక్ కి కంగనా కౌంటర్

షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు వివాదం బాలీవుడ్ లో సంచలనంగా మారింది . క్రూయిజ్ షిప్ లో ఆర్యన్ ఖాన్, అతడి స్నేహితులు రేవ్ పార్టీ నిర్వహిస్తూ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులకు చిక్కారు.

Kangana ranaut gives counter to Hrithik Roshan over aryan khan case
Author
Hyderabad, First Published Oct 7, 2021, 9:51 PM IST

షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు వివాదం బాలీవుడ్ లో సంచలనంగా మారింది . క్రూయిజ్ షిప్ లో ఆర్యన్ ఖాన్, అతడి స్నేహితులు రేవ్ పార్టీ నిర్వహిస్తూ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులకు చిక్కారు. శనివారం రాత్రి ఎన్సీబీ అధికారులు షిప్ పై రైడ్ నిర్వహించగా ఆర్యన్ ఖాన్, అతడి స్నేహితులు చిక్కారు. 

ఈ పార్టీలో వారు డ్రగ్స్ వాడుతున్నట్లు అధికారులు ఆరోపించారు. అలాగే సముద్ర తీర ప్రాంతంలో కోట్ల విలువ చేసే డ్రగ్స్ ని ఎన్సీబీ స్వాధీనం చేసుకుంది. ప్రస్తుతం ఆర్యన్ ఖాన్ ని అధికారులు జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. ఇదిలా ఉండగా ఆర్యన్ ఖాన్ అరెస్ట్ అయినప్పటి నుంచి షారుఖ్ టెన్షన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. 

షారుఖ్ కి అతడి కుటుంబానికి ధైర్యం చెప్పేందుకు బాలీవుడ్ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. ఆర్యన్ ఖాన్ అరెస్ట్ అయ్యాక సల్మాన్ ఖాన్ స్వయంగా షారుఖ్ ని కలిశాడు. ఇక హృతిక్ రోషన్ ఆర్యన్ ఖాన్ కి మద్దతు తెలుపుతూ బహిరంగంగా లేఖ విడుదల చేశాడు. 

బాలీవుడ్ ప్రముఖులపై ఎప్పుడూ విమర్శలు గుప్పించే ఫైర్ బ్రాండ్ లేడి కంగనా రనౌత్ రంగంలోకి దిగింది. హృతిక్.. ఆర్యన్ ఖాన్ కి మద్దతు తెలుపగానే అతడికి కంగనా కౌంటర్ ఇచ్చింది. పరోక్షంగా హృతిక్ పై వ్యాఖ్యలు చేసింది. ' ఆర్యన్ ఖాన్ చేసిన తప్పులు, వాటివల్ల కలిగే ఇబ్బందులు అతడి దృక్పధాన్ని మారుస్తాయి. అంతమాత్రాన అతడు చేసిన తప్పులని సమర్ధించకూడదు. ఆర్యన్ ఖాన్ డిపెండ్ చేయడానికి మాఫియా పప్పు బ్యాచ్ రంగంలోకి దిగేసింది. 

Also Read: ముంబై డ్రగ్స్ కేసు: ఆర్యన్‌ఖాన్‌కు కోర్టులో మళ్లీ ఎదురుదెబ్బ... 14 రోజుల రిమాండ్

మనం తప్పులు చేస్తాం.. కానీ ఎప్పుడూ వాటి గురించి గొప్పగా చెప్పుకోము అంటూ కంగనా ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో పోస్ట్ పెట్టింది. హృతిక్.. ఆర్యన్ ఖాన్ కి మద్దతు తెలుపుతూ పోస్ట్ పెట్టిన కొన్ని నిమిషాలకే కంగనా ఈ పోస్ట్ పెట్టడం విశేషం. 

ఇదిలా ఉండగా ముంబై కోర్టు ఆర్యన్ ఖాన్ కు బెయిల్ నిరాకరించింది. మరికొంతకాలం ఆర్యన్ ఖాన్ ని విచారించాలని ఎన్సీబీ అధికారులు కోరడంతో .. కోర్టు వారితో ఏకీభవించింది. హృతిక్ రోషన్, కంగనా రనౌత్ మధ్య విభేదాలు చాలా కాలంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అప్పట్లో వీరిద్దరి మధ్య ఎఫైర్, విడిపోవడం.. ఆ తర్వాత హృతిక్ పై కంగనా ఆరోపణలు చేయడం బాలీవుడ్ లో సంచలనం సృష్టించాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios