వెంకటేష్, రానాపై క్రిమినల్ కేసు నమోదుకి కోర్టు ఆదేశం.. డెక్కన్ కిచెన్ వివాదంలో దగ్గుబాటి ఫ్యామిలీకి షాక్
విక్టరీ వెంకటేష్ ఎప్పుడూ వివాదాల్లో కనిపించరు. చిత్ర పరిశ్రమకి సంబంధించిన అంశాలలలో కూడా వెంకీ తన పని తాను చేసుకుని వెళుతుంటారు. అయితే సురేష్ బాబు మాత్రం మూవీ బిజినెస్ లో ఇన్వాల్వ్ అవుతుండడం చూస్తూనే ఉన్నాం.
విక్టరీ వెంకటేష్ ఎప్పుడూ వివాదాల్లో కనిపించరు. చిత్ర పరిశ్రమకి సంబంధించిన అంశాలలలో కూడా వెంకీ తన పని తాను చేసుకుని వెళుతుంటారు. అయితే సురేష్ బాబు మాత్రం మూవీ బిజినెస్ లో ఇన్వాల్వ్ అవుతుండడం చూస్తూనే ఉన్నాం. ఇతర వివాదాల్లో దగ్గుబాటి ఫ్యామిలీ కనిపించడం తక్కువ. అయితే తాజాగా దగ్గుబాటి ఫ్యామిలీకి ఊహించని షాక్ తగిలింది.
నాంపల్లి కోర్టు హీరో వెంకటేష్, రానా దగ్గుబాటి, సురేష్ బాబు, దగ్గుబాటి అభిరామ్ లపై క్రిమినల్ కేసు నమోదు చేయాలనీ ఆదేశాలు జారీ చేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఫిలిం నగర్ లో ఉన్న డెక్కన్ కిచెన్ స్థలం విషయంలో నందకుమార్, దగ్గుబాటి ఫ్యామిలీ మధ్య కొన్నేళ్లుగా వివాదం సాగుతోంది.
ఆ స్థలం విషయంలో దగ్గుబాటి ఫ్యామిలీ తప్పుడు డాక్యుమెంట్స్ క్రియేట్ చేశారని నందకుమార్ ఆరోపిస్తున్నారు. కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ డెక్కన్ కిచెన్ బిల్డింగ్ ని కూల్చివేసి ఫర్నిచర్ ఎత్తుకుపోయారని. తనకు 20 కోట్ల వరకు నష్టం వాటిల్లింది అంటూ నందకుమార్ కోర్టులో ఫిటిషన్ వేశారు.
ఫిటిషన్ విచారించిన కోర్టు.. ఐపీసీ 448, 452, 380 ఇలా పలు సెక్షన్ల కింద వెంకటేష్, రానా, సురేష్ బాబు, అభిరామ్ పై క్రిమినల్ కేసు పెట్టాలని ఫిలిం నగర్ పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. దగ్గుబాటి కుటుంబ సభ్యుల నుంచి తనకు హాని ఉన్నట్లుగా కూడా నందకుమార్ పిటిషన్ లో పేర్కొన్నారు. తాను ఒక కేసులో చిక్కుకుంటే దానిని అడ్వాంటేజ్ గా తీసుకుని డక్కన్ కిచన్ పై తప్పుడు డాక్యుమెంట్స్ క్రియేట్ చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై దగ్గుబాటి ఫ్యామిలీ ఎలా స్పందిస్తుందో చూడాలి.