సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సౌత్ లో టాప్ లీగ్ లో మహేష్ దూసుకుపోతున్నాడు. ఇక ఎండార్స్మెంట్స్ విషయంలో అయితే ఇండియాలోనే టాప్ హీరోల్లో ఒకరిగా మహేష్ ఉన్నారు. షారుఖ్, రణ్వీర్ సింగ్ లాంటి స్టార్స్ తో పోటీ పడుతూ మహేష్ బ్రాండింగ్ లో దూసుకుపోతున్నాడు.
సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సౌత్ లో టాప్ లీగ్ లో మహేష్ దూసుకుపోతున్నాడు. ఇక ఎండార్స్మెంట్స్ విషయంలో అయితే ఇండియాలోనే టాప్ హీరోల్లో ఒకరిగా మహేష్ ఉన్నారు. షారుఖ్, రణ్వీర్ సింగ్ లాంటి స్టార్స్ తో పోటీ పడుతూ మహేష్ బ్రాండింగ్ లో దూసుకుపోతున్నాడు. లెక్కలేనన్ని కార్పొరేట్ సంస్థలకు మహేష్ ప్రచార కర్తగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
అయితే మహేష్ బాబు ప్రచారం కల్పించిన ఓ రియల్ ఎస్టేట్ కంపెనీపై తాజాగా చీటింగ్ కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. సాయి సూర్య డెవలపర్స్ అనే రియల్ ఎస్టేట్ కంపెనీ హైదరాబాద్ వెంగళరావు నగర్ కేంద్రంగా బిజినెస్ చేస్తోంది. ఈ కంపెనీకి మహేష్ బాబు ప్రచార కర్తగా ఉన్నారు. అయితే రూ. 3 కోట్ల 21 లక్షల చీటింగ్ వ్యవహారంలో ఈ కంపెనీ ఓనర్ కంచర్ల సతీష్ చంద్రగుప్త పై చీటింగ్ కేసు నమోదైంది.
2021 ఏప్రిల్ లో షాద్ నగర్ లోని 14 ఎకరాల భూమి కోసం నక్క విష్ణువర్ధన్ అనే వ్యక్తి తన స్నేహితులతో కలసి పెట్టుబడులు పెట్టాడు. విష్ణు వర్ధన్ తో పాటు పెట్టుబడి పెట్టిన వారిలో డాక్టర్ సుధాకర్ రావు, శ్రీకాకుళం విఠల్ మహేష్, రాజేష్ లాంటి వారు ఉన్నారు. వ్యవసాయేతర భూమి విషయంలో కంపెనీతో వీరు ఒప్పందం కుదుర్చుకున్నారు.
హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ నుంచి త్వరలోనే అనుమతులు తీసుకుంటాం అని ఆ తర్వాత వెంటనే ఫ్లాట్ ల రిజిస్టర్ పనులు పూర్తి చేస్తాం అని సాయి సూర్య డెవలపర్స్ కంపెనీ హామీ ఇవ్వడంతో వారు పెట్టుబడులు పెట్టారు. అయితే ఇన్ని రోజులు గడుస్తున్నా కంపెనీ నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడడంతో విష్ణువర్ధన్, అతని స్నేహితులకు అనుమానం మొదలైంది.
కంపెనీ నుంచి స్పష్టమైన సమాధానం రాలేదు. దీనితో అనుమానం మరింత పెరిగి రిజిస్టర్, స్టాంప్ డిపార్ట్ మెంట్ లో విచారణ చేశారు. దీనితో విష్ణు వర్ధన్ అండ్ కోకి దిమ్మతిరిగి విషయం తెలిసింది. వారు పెట్టుబడి పెట్టిన భూమి అప్పటికే ఎస్వీఆర్, టీవీఆర్, వెంకటేష్ అనే ఫైనాన్షియర్ల కంపెనీల పేరుమీదికి రిజిస్టర్ అయిపోయిందట.
దీనితో ఏమి పాలుపోక విష్ణువర్ధన్ అతని స్నేహితులు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. సాయి సూర్య డెవలపర్స్ కి ఉన్న ఇమేజ్, మహేష్ బాబు లాంటి స్టార్స్ ప్రచారం చేయడంతో నమ్మకంతో ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్నామని.. కానీ మోసం జరిగిందని తెలిశాక అంతా షాక్ లో ఉన్నామని వారు ఫిర్యాదు లో పేర్కొన్నారు. దీనితో పోలీసులు సెక్షన్ 406, 420 కింద ఆర్థిక అవకతవకలు, మోసానికి పాల్పడినట్లు కేసు తీసుకున్నారు.
