Asianet News TeluguAsianet News Telugu

ఆహుతి ప్రసాద్ కొడుకుపై కేసు నమోదు!

దివంగత నటుడు ఆహుతి ప్రసాద్ గురించి తెలియనివారుండరు. వందలాది చిత్రాల్లో తన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణించారు. కోనసీమ యాసలో డైలాగులు చెప్పడంలో ఆహుతి ప్రసాద్ కు ప్రత్యేకమైన శైలి ఉంది. తాజాగా ఆహుతి ప్రసాద్ తనయుడు కార్తీక్ ప్రసాద్ వార్తల్లో నిలిచారు.

Case filed against Ahuti Prasad's son
Author
Hyderabad, First Published Jun 6, 2019, 6:01 PM IST

దివంగత నటుడు ఆహుతి ప్రసాద్ గురించి తెలియనివారుండరు. వందలాది చిత్రాల్లో తన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణించారు. కోనసీమ యాసలో డైలాగులు చెప్పడంలో ఆహుతి ప్రసాద్ కు ప్రత్యేకమైన శైలి ఉంది. తాజాగా ఆహుతి ప్రసాద్ తనయుడు కార్తీక్ ప్రసాద్ వార్తల్లో నిలిచారు. కార్తీక్ ప్రసాద్ పై బంజారాహిల్స్ పోలీస్టేషన్ లో కేసు నమోదైంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళదాం. 

ఇటీవల కార్తీక్ ప్రసాద్ బంజారాహిల్స్ రోడ్ నెం 2లో సినిమా చూసేందుకు పీవీఆర్ సినిమాస్ కు వెళ్లారు. షో ప్రారంభమయ్యే ముందు జాతీయ గీతం వస్తుంది. జాతీయ గీతం వస్తున్న సమయంలో కార్తీక్ ప్రసాద్ లేచి నిలబడలేదట. అతడి పక్కనే ఉన్న వ్యక్తి..జాతీయ గీతం వస్తోంది కదా.. లేచి నిలబడండి అని అడిగాడట. తనని ప్రశ్నించాడనే కోపంతో కార్తీక్ ప్రసాద్ ఆ వ్యక్తిని బూతు పదజాలంతో దూషించినట్లు తెలుస్తోంది. 

అసభ్యకరంగా వ్యాఖ్యలు  చేసినకార్తీక్ ప్రసాద్ కు బుద్ది చెప్పాలని సదరు వ్యక్తి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. సినిమా థియేటర్స్ లో జాతీయ గీతం ప్లే చేయాలనే నిబంధనని ప్రభుత్వం తీసుకువచ్చాక దీనిపై సర్వత్రా చర్చ జరిగింది. థియేటర్స్ లో జాతీయ గీతం అవసరమా అని వ్యక్తిరేకించిన వాళ్ళు కూడా ఉన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios