ఈరోజు నామినేషన్స్ మొదలైపోయాయి. సోమవారం కావడంతో బిగ్ బాస్ నామినేషన్ స్ ప్రక్రియ ప్రారంభించారు.  కెప్టెన్ అయిన అఖిల్ హారిక మరియు అభిజిత్ ని నామినేట్ చేశాడు. ఈ టాస్క్ లో అఖిల్ మరియు అభిజిత్ మధ్య పెద్ద గొడవైంది. హారిక అఖిల్ కూడా  గొడవ పెట్టుకుంది. అఖిల్ పై అనేక ఆరోపణలు చేసింది. 

హారిక్ మాట్లాడిన తరువాత అభిజిత్ అఖిల్ తో గొడవకు దిగాడు. వీరిద్దరి మధ్య వాడి వేడి చర్చ నడిచింది. అఖిల్ మరియు అభిజిత్ భయంకరమైన గొడవకు దిగారు. ఈ విషయంలో  అఖిల్ , అభిజిత్ గొడవ పీక్స్ చేరింది. నువ్వెంత అంటే నువ్వెంత అన్న వరకు వెళ్ళింది. 

ఈ గొడవలో అఖిల్ మరియు అభిజిత్ కొన్ని హద్దులు కూడా దాటేశారు. సీరియస్ గా తిట్టుకున్నారు. కాగా అఖిల్ వాళ్లిద్దరినీ నామినేట్ చేయడం వెనుక మరొక రీజన్ కనబడుతుంది. అఖిల్-మోనాల్ హౌస్ లో ప్రేమికులుగా ఉన్నారు. కొత్తగా అభిజిత్- హారిక చాలా దగ్గర అవుతున్నారు. ఈ నేపథ్యంలో అభిజిత్ పై కోపం పెంచుకున్న అఖిల్ వీరిద్దరి నామినేట్ చేశాడు అనిపించింది.