Asianet News TeluguAsianet News Telugu

బ్రహ్మాస్త్రంను ఇక ఎన్టీఆరే కాపాడాలి!

చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేకుండా బాలీవుడ్ చిత్రాలన్నీ అటకెక్కుతున్నారు. ఆరు నెలల కాలంలో హిట్ టాక్ తెచ్చుకున్నవి ఐదారు కూడా లేవు. ఇలాంటి పరిస్థితుల్లో వస్తున్న బ్రహ్మాస్తం సినిమాను ఓ సెంటిమెంట్ కాపాడుతుందేమో చూడాలి. 
 

can ntr golden hand sentiment saves brahmastra movie
Author
First Published Sep 1, 2022, 5:01 PM IST

కరణ్ జోహార్ నిర్మాతగా బ్రహ్మాస్త్రం భారీ బడ్జెట్ తో తెరెకెక్కింది. ఈ మధ్య కాలంలో ఈ రేంజ్ సినిమా బాలీవుడ్ లో నిర్మితం కాలేదు. రన్బీర్ కపూర్ హీరోగా అలియా భట్ హీరోయిన్ గా సోసియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కించారు. నాగార్జున, అమితాబ్, షారుఖ్ ఖాన్ వంటి స్టార్ క్యాస్ట్ మూవీలో భాగమయ్యారు. కాగా బాలీవుడ్ లో నెలకొన్న తాజా పరిస్థితులు మేకర్స్ ని భయపెడుతున్నాయి. భారీ నుండి మీడియా రేంజ్ సినిమాలు వరుసగా బోల్తా కొడుతున్నాయి. 

గత ఆరు నెలల కాలంలో బాలీవుడ్ లో విడుదలైన చిత్రాల్లో విజయం సాధించినవి ఏవంటే తడుముకోవాల్సిన పరిస్థితి. భూల్ బులియా 2, కశ్మీర్ ఫైల్స్ వంటి ఒకటి రెండు చిత్రాలు మాత్రమే సంచలనాలు నమోదు చేశాయి. ఇక ప్లాప్ లిస్ట్ చెప్పాలంటే చాంతాడు అంత ఉంది. ఈ మధ్య కాలంలో విడుదలైనషంషేరా, లాల్ సింగ్ చడ్డా కనీస వసూళ్లు రాబట్టలేక పోయాయి. లాల్ సింగ్ చడ్డా అమీర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. 

కంటెంట్ తో పాటు వినోద రంగంలో వచ్చిన మార్పులు, ప్రేక్షకుల అభిరుచి, ఎంపిక, సోషల్ మీడియా నెగిటివిటీ ఈ గడ్డు పరిస్థితులకు కారణం. ఇలాంటి కఠిన సమయంలో థియేటర్స్ లోకి వస్తున్న బ్రహ్మాస్త్రం పెను సవాళ్ళను ఎదుర్కోవలసి ఉంది. ప్రస్తుత ట్రెండ్ కొనసాగితే బ్రహ్మస్రం ఊహించని రీతిలో నష్టాలు మిగల్చడం ఖాయం. అదే సమయంలో సోషల్ మీడియా జనాలు వ్యతిరేకించే టీమ్ అందరూ కలిసి పని చేస్తున్న చిత్రం ఇది. కరణ్ జోహార్, అలియా భట్, రన్బీర్ కపూర్ పై ఎనలేని నెగిటివిటీ ఉంది. ఆల్రెడీ బాయ్ కాట్ బ్రహ్మస్త్ర హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. 

ఇన్ని ప్రతికూల అంశాల మధ్య ఓ పాజిటివ్ సెంటిమెంట్ హోప్ కలిగిస్తుంది. అది ఎన్టీఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా రావడం. పరిశ్రమలో ఎన్టీఆర్ ది లక్కీ హ్యాండ్ గా పేరుంది. ఆయన మూవీ ఓపెనింగ్ చేసినా, ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చినా సూపర్ హిట్ అన్న సెంటిమెంట్ ఉంది. ఇటీవల విడుదలైన బింబిసార దీనికి గొప్ప ఉదాహరణ. ఎన్టీఆర్ సెంటిమెంట్ ప్రతి సినిమాకు పని చేసిందని చెప్పడం లేదు కానీ... అధిక చిత్రాలు విజయాలు సాధించాయి. సెప్టెంబర్ 2న హైదరాబాద్ లో జరగనున్న బ్రహ్మాస్త్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎన్టీఆర్ గెస్ట్ గా వస్తున్నారు. సెప్టెంబర్ 9న మూవీ విడుదల కానుంది. మరి ఎన్టీఆర్ ఏ మేరకు బ్రహ్మాస్తం ని కాపాడతాడో చూడాలి. ఐదు భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా విడుదలవుతున్న బ్రహ్మాస్త్రం చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకుడు.

Follow Us:
Download App:
  • android
  • ios