స్టార్ గా ఎదుగుతున్న యువనటుడు జీవితం విషాదంగా ముగిసింది. 20 ఏళ్ల వయసులోనే బుల్లితెర రారాజుగా మారిన కామెరూన్ బాయ్ సే తాజాగా మృతి చెందాడు. ప్రఖ్యాత డిస్ని సంస్థలో నటిస్తూ టివి రంగంలో కామెరూన్ తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకున్నాడు. 

20 ఏళ్ల యుక్త వయసులో కామెరూన్ మరణించడం అటు కుటుంబ సభ్యులు, హాలీవుడ్ ప్రముఖులు విషాదంలో మునిగిపోయారు. కామెరూన్ కుటుంబానికి చెందిన అధికార ప్రతినిధి అతడి మరణ వార్తని వాషింగ్టన్ పోస్ట్ సంస్థకు తెలియజేశాడు. కామెరూన్ గత కొంత కాలంగా మెదడుకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నాడు. 

లాస్ ఏంజల్స్ లో జన్మించిన కామెరూన్ 10 ఏళ్ల వయసునుంచే నటుడిగా కెరీర్ ప్రారంభించాడు. టివి సీరియల్స్, రియాలిటీ షోలు, వెబ్ సిరీస్ ల ద్వారా కామెరూన్ కు మంచి గుర్తింపు లభించింది. ప్రఖ్యాత డిస్ని సంస్థలో అతడు నటించడంలో మరింతగా ప్రేక్షకులకు చేరువయ్యాడు. కామెరూన్ కొన్ని సినిమాల్లో కూడా నటించాడు.