దగ్గుబాటి రానా సమర్పణలో సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన చిత్రం ‘కేరాఫ్ కంచరపాలెం’. విజయ ప్రవీణ పరుచూరి నిర్మాణ సారథ్యంలో తెరకెక్కిన  ఈ చిత్రంతో వెంకటేష్ మహా అనే నూతన దర్శకుడు పరిచయం అయ్యారు. విడుదలకు ముందే న్యూయార్క్‌ చలన చిత్రోత్సవంలో ప్రదర్శనకు ఎంపికైన తొలి తెలుగు సినిమా కావడం, ఇంకా రానా సమర్పిస్తుండటంతో.. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

 వైజాగ్‌ దగ్గరలో ఉన్న కంచర‌పాలెం నేప‌థ్యంలో సాగే భిన్న‌మైన ప్రేమ‌క‌థగా తెరకెక్కిన ఈ చిత్రం రిలీజ్ తర్వాత మంచి టాక్, భాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ బాగానే వసూలు చేసింది.  అయితే ఇప్పుడు మళ్ళీ ఆ టాపిక్ ఎందుకూ అంటే ..ఈ దర్శకుడు తన తదుపరి చిత్రానికి రంగం సిద్దం చేస్తున్నారు. అందులో భాగంగా కాస్టింగ్ కాల్ ఎనౌన్స్ చేసారు. 

ప్రస్తుతం కథలో ముగ్గురు హీరోయిన్స్ కావాలి.  నలుగు స్పష్టంగా మాట్లాడగల అచ్చమైన తెలుగమ్మాయిల కోసం వెతుకుతున్నారు. వారు దొరకగానే షూటింగ్ మొదలుకావొచ్చు. ఈ చిత్రాన్ని కూడా ‘కేరాఫ్ కంచరపాలెం’ చిత్ర నిర్మాత విజయ ప్రవీణ పరుచూరి నిర్మిస్తున్నారు.   మొదటి సినిమాతో తనలోని మ్యాజిక్ చూపిం వెంకటేష్ మహా రెండవ సినిమాతోనూ అద్బుతం చేస్తారని భావిస్తున్నారు.