Asianet News TeluguAsianet News Telugu

మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీపై మళ్లీ బజ్.. తొలిచిత్రమే మల్టీస్టారర్ గా.. తనయుడి కోసం బాలయ్య అలా చేస్తారా?

నందమూరి నటసింహాం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ (Mokshagna) టాలీవుడ్‌ ఎంట్రీపై మళ్లీ ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తోంది. త్వలోనే సినిమా ప్రారంభం కాబోతుందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన డిటేయిల్స్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి.
 

Buzz again on Mokshagnas Tollywood entry and Will Balayya do that for his son?
Author
First Published Nov 28, 2022, 6:49 PM IST

టాలీవుడ్ సీనియర్ నందమూరి నటసింహాం బాలకృష్ణ (Balakrishna) బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో అలరిస్తూనే ఉన్నారు. వయస్సు పెరుగుతున్నా కొద్దీ మరింత జోష్ కనబరుస్తున్నారు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. బాలయ్య నట వారసుడు మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ ఇప్పటికీ పూర్తవ్వకపోవడంతో అభిమానులు కాస్తా అప్సెట్ అవుతున్నారు. ఐదారేండ్ల నుంచి పలు నిర్ణయాలు తీసుకుంటున్నా కార్యరూపం దాల్చడం లేదు. దీంతో మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇస్తారా? లేదా? అనేదని అభిమానుల్లో  సందేహంగా మారింది.

ఈ  క్రమంలో తాజాగా మోక్షజ్ఞ వెండితెరకు ఎంట్రీ ఇవ్వడం ఖామనే అంటున్నారు. అయితే ఆ చిత్రాన్ని బాలయ్యనే డైరెక్ట్ చేయబోతున్నారనే విషయంలో మార్పు జరిగే అవకాశం ఉందట. వచ్చే ఏడాది మాస్ ఆడియెన్స్ కు నచ్చే సబ్జెక్ట్ తోనే మోక్షజ్ఞ సినిమా ఉండబోతుందనే ప్రచారం జరుగుతోంది. మోక్షజ్ఞ తొలిచిత్రమే మల్టీస్టారర్ గా రాబోతుందని.. అందులోనూ బాలయ్య  విలన్ గా నటిస్తే బాగుంటుందని అభిమానులు ఆశపడుతున్నారు. మాస్ కంటెంట్ తో అలరిస్తున్న బాలయ్య నెగెటివ్ షేడ్స్ లో కనిపిస్తే.. అది మోక్షజ్ఞ తొలిచిత్రంలో ఈ ప్రయోగం చేస్తే  సాలిడ్ గా ఉంటుందని పలువురు దర్శకులు కూడా భావిస్తున్నట్టు సమాచారం. తనయుడి కోసం బాలయ్య ఇలా చేస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది.

అయితే, ఇటీవల ‘అఖండ’ సక్సెస్ పట్ల ఓ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన దర్శకుడు బోయపాటి  శ్రీను కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. బాలయ్యను పొలిటికల్ డ్రామాలో చూపించే అవకాశం  ఉందా? అని ప్రశ్నించగా.. ‘ఇప్పుడే చెప్పలేం.  కథ డిమాండ్ చేస్తే తప్పకుండా చూపిస్తాం.  అది పొలిటీషన్ గానా.. లేదంటే నెగెటివ్ రోల్ లో చూపిస్తామన్నది తెలియదు.’ అంటూ బోయపాటి చేసిన కామెంట్స్ కూడా ఆసక్తికరంగా మారాయి. దీంతో త్వరలోనే బాలయ్య విలన్ గా దర్శనమిస్తారనే సంకేతం కూడా అందినట్టైంది. అయితే అది మోక్షజ్ఞ సినిమాలోనే అని కొందరు అభిప్రాయపడుతున్నారు. 

ఇప్పటికే నందమూరి కళ్యాణ్ రామ్ ‘బింబిసారా’తో సాలిడ్ హిట్ ను సొంతం  చేసుకుంది.  నాలుగు భాగాలుగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలోని ఏదోక పార్టులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR)కూడా  దర్శనమివ్వనున్నారని ఇప్పటికే అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మోక్షజ్ఞ తొలిచిత్రం  కూడా మల్టీస్టారర్ గా వస్తే బాగుంటుందని,  అందులోనూ బాలయ్య విలన్ గా నటిస్తే మామూలుగా ఉండదంటూ అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తానికి వచ్చే ఏడాది సినిమా ప్రారంభంపై పూర్తిగా క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios