Asianet News TeluguAsianet News Telugu

మెగా హీరో సినిమాలో ''బిల్డప్ బాబాయ్''

సినిమావాళ్ళు బయిట ఏం హాట్ టాపిక్ నడుస్తోందా...జనాలు ఏ విషయం ఎక్కువ చర్చించుకుంటున్నారా అనే విషయాలపై కాన్సర్టేట్ చేస్తూంటారు. అందుకే జబర్దస్త్ బ్యాచ్ కు సినిమాల్లో ఆఫర్స్ వస్తున్నాయి. 

Buildup Babai character in mega Movie?
Author
Hyderabad, First Published Dec 31, 2018, 9:19 AM IST

సినిమావాళ్ళు బయిట ఏం హాట్ టాపిక్ నడుస్తోందా...జనాలు ఏ విషయం ఎక్కువ చర్చించుకుంటున్నారా అనే విషయాలపై కాన్సర్టేట్ చేస్తూంటారు. అందుకే జబర్దస్త్ బ్యాచ్ కు సినిమాల్లో ఆఫర్స్ వస్తున్నాయి.   ఈ షోల ద్వారా సినిమాల్లోకి వెళ్లే నటులు పెరిగిపోతున్నారు. తాజాగా సుడిగాలి సుధీర్ టీమ్‌లో ఒకడైన గెటప్ శీను వేసిన   ''బిల్డప్ బాబాయ్'' గురించి చర్చ మొదలైంది. గెటప్ శ్రీను కి ఇప్పటికే మంచి ఫాలోయింగ్ వుంది.  జబర్ధస్త్ లో చేసిన బిల్డప్ బాబాయ్ స్కిట్  పెద్ద హిట్ కావటంతో అతనికి సినీ అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. 

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మెగా హీరో సాయి ధరమ్ తేజ తాజా చిత్రం చిత్రలహలో బిల్డప్ బాబాయ్ పాత్రను పెట్టినట్లు సమాచారం. ఈ మేరకు కొన్ని సీన్స్ ని హీరోకు, గెటప్ శ్రీను కు మధ్య జరుగుతాయని , సినిమాలో ఆ సీన్స్ హైలెట్ అవుతాయని చెప్పుకుంటున్నారు. గెటప్ శ్రీను కూడా చాలా ఉత్సాహంగా ఈ షూట్ లో పాల్గొనబోతున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. 

ఇక వరుస ఫ్లాప్‌లతో కెరీర్‌ కష్టాల్లో పడేసుకున్న ఈ మెగా హీరో తదుపరి చిత్రాలు జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం నేను శైలజ ఫేం కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో చిత్రలహరి సినిమాలో నటిస్తున్న సాయి.. తరువాత చేయబోయే సినిమాను కూడా ఫైనల్‌ చేసినట్టుగా తెలుస్తోంది.

పిల్ల జమీందార్‌ సినిమాతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న అశోక్‌, ఇటీవల భాగమతితో మరో విజయాన్ని అందుకున్నాడు. ఈ దర్శకుడితో ఓ సినిమా చేసేందుకు సాయి ధరమ్‌ ఓకె చెప్పాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios