`బ్రో` సెన్సార్ రిపోర్ట్.. పవన్ సినిమాకి ఇలాంటిది చాలా అరుదు?.. టైటిల్‌తోనే బ్రాండ్..
గతేడాది `భీమ్లా నాయక్`తో రచ్చ చేసిన పవన్ ఇప్పుడు `బ్రో` చిత్రంతో రాబోతున్నారు. సాయితేజ్ మరో హీరోగా నటించిన ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న `బ్రో` సినిమా వచ్చే వారంలో విడుదల కాబోతుంది. తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ రిపోర్ట్ ఆశ్చర్యపరుస్తుంది. ఈ సినిమాకి క్లీన్ `యూ` సర్టిఫికేట్ రావడం విశేషం. పవన్ కళ్యాణ్ సినిమాలకు `యూ` సర్టిఫికేట్ రావడం ఫ్యాన్స్ ని సైతం షాక్‌కి గురి చేస్తుంది. పవన్ సినిమా అంటే మాస్ ఎలిమెంట్లు, ఫైట్లు, సాంగులు ఎక్స్ పెక్ట్ చేస్తారు ఫ్యాన్స్. ఈ లెక్కన ఇందులో ఆయా సీన్లు ఉండబోవని అర్థమవుతుంది. మరి దీన్ని ఫ్యాన్స్ ఎలా తీసుకుంటారనేది చూడాలి.
పవన్ కళ్యాణ్ నటించిన `గోపాల గోపాల` కూడా యూ సర్టిఫికేటే పొందింది. అందులో వెంకటేష్ మరో హీరో. ఆ చిత్రం ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. చాలా గ్యాప్‌తో ఇప్పుడు `బ్రో` చిత్రానికి యూ సర్టిఫికేట్ వచ్చింది. ఈ సినిమా ఎలా ఉండబోతుందనే ఆసక్తి నెలకొంది. ఇక సినిమా నిడివి విషయంలోనూ సర్‌ప్రైజ్ చేసింది. కేవలం రెండు గంటల 16 నిమిషాలు మాత్రమే ఉన్నట్టు సమాచారం. ఓ పెద్ద హీరోల సినిమాల నిడివి ఇంత తక్కువ ఉండటం కూడా ఆశ్చర్యపరిచే అంశమే. షార్ట్ అండ్ స్వీట్‌గా ఈ సినిమాని తెరకెక్కించారని అర్థమవుతుంది.
`టైమ్ నేపథ్యంలో సాగే చిత్రమిది. దేవుడు కంటే టైమే గొప్పదని చెప్పే కథాశంతో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇందులో సాయిధరమ్ తేజ్.. యాక్సిడెంట్‌లో చనిపోతే.. తాను చేరుకోవాల్సిన లక్ష్యాలు కొన్ని ఉన్నాయని, వాటిని రీచ్ అయ్యేందుకు మరో నెల రోజులు కావాలని టైమ్ ని అడుగుతాడు. లైఫ్‌లో సెకండ్ ఛాన్స్ ఇస్తే సాయిధరమ్ తేజ్ ఏం చేశాడనేది ఈ సినిమా కథ. దాన్ని ఎంత ఆసక్తికరంగా, ఎంత కమర్షియల్‌గా తెరకెక్కించారనేది `బ్రో` సినిమాలో ఆసక్తికరం. ఇందులో పవన్ టైమ్‌గా కనిపించబోతున్నారు. తమిళంలో రూపొందిన `వినోదయ సిత్తం` చిత్రానికిది రీమేక్.
తమిళంలో సముద్రఖని దర్శకత్వం వహించారు. తెలుగులోనూ ఆయనే దర్శకుడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దీనికి మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ నెల 28న సినిమా విడుదల కానుంది. ఈ నెల 22న చిత్ర ట్రైలర్ ని, ఈ నెల 25న శిల్పకళావేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహిస్తున్నారు. తాజాగా బుధవారం జరిగిన ఇంటర్వ్యూలో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ, సినిమా కమర్షియల్‌గా అన్ని రకాల హంగులతో ఉంటుందని, ఫ్యాన్స్ ని, జనరల్ ఆడియెన్స్ ని సైతం ఆకట్టుకుంటుందన్నారు.
ఇదిలా ఉంటే `బ్రో` మానియా మామూలుగా లేదు. ఈ టైటిల్ పేరుతో ఏకంగా క్లాత్స్ బ్రాండ్ రావడం విశేషం. అమెజాన్.. `బ్రో` పేరుతో క్లాత్స్ తయారు చేయించింది. బ్రో టైటిల్ పోస్టర్‌తో టీషర్ట్ లను తయారు చేసింది. అమెజాన్ దీన్ని అందుబాటులోకి తేనుంది.